News March 27, 2025
VKB: జిల్లా వాసికి అత్యున్నతమైన సోషల్ సర్వీస్ అవార్డ్

సామాజిక సేవా రంగంలో చేసిన విశిష్ట సేవలకు గాను అత్యున్నతమైన డాక్టరేట్ ఆఫ్ సోషల్ సర్వీస్ పురస్కారం అందుకోవడం సంతోషాన్ని కలిగించిందని జిల్లా వాసి జాటోత్ రవి నాయక్ అన్నారు. ఈ మేరకు ఢిల్లీలోని హానరరీ డాక్టరేట్ అవార్డు కౌన్సిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురి ప్రశంసలు వెలువెత్తాయి.
Similar News
News April 19, 2025
ఏలూరు: రూ.5.71 కోట్లు ఖాతాల్లో జమ

దెందులూరు, పెదవేగి, పెదపాడు మండలాల పరిధిలో 21 రైతు సేవా కేంద్రాల్లో రబీ కొనుగోళ్లు ప్రారంభించామని సివిల్ సప్లై జిల్లా అధికారి మూర్తి అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఈ 3 మండలాల్లో 915 మంది రైతుల నుంచి రూ.27.62 కోట్లు విలువ గల 9474.240 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. సుమారుగా రూ.5.71 కోట్లు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయుట జరిగిందన్నారు.
News April 19, 2025
ATP: తాడిపత్రి ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పిస్తా – ఎంపీ

అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య ఉపకరణాలకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకుడు వై నారాయణరెడ్డి, మల్లికార్జున రెడ్డి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను శనివారం కలిశారు. అనంతపురంలోని ఎంపీ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎంపీ రూ. కోటి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
News April 19, 2025
త్వరలో 20వేల ఉద్యోగాల భర్తీ: మంత్రి రాజనర్సింహ

యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు 20 వేలకు పైగా పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి పట్టణంలో 500 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను శనివారం ఆయన పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందజేస్తామన్నారు. ఎంపీ సురేశ్ శెట్కార్, ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొన్నారు.