News March 21, 2025
VKB: టెన్త్ పరీక్షలు.. ఈసారి కొత్త విధానం

నేటి నుంచి వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 69 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 12,903 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు. ఉ.9.30 గంటలకు పరీక్షలకు ప్రారంభం కానుండగా 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. తొలిసారిగా 24 పేజీల బుక్ లెట్ ఇవ్వనున్నారు. ఎలాంటి అడిషనల్ పేజీలు ఇవ్వబోమని అధికారులు తెలిపారు. >SHARE IT
Similar News
News February 28, 2026
కృష్ణా: రేషన్ మాఫియా మాయాజాలం!

విజయవాడ సహా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రేషన్ మాఫియా రాజకీయ అండతో రెచ్చిపోతోందనే విమర్శలొస్తున్నాయి. పేదల బియ్యంపై ఏకంగా వేలం పాటలు నిర్వహిస్తూ, గెలిచిన వారు ప్రజాప్రతినిధులకు నెలకు రూ.10 నుంచి 15లక్షల వరకు ముట్టజెబుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాము అనే వ్యక్తి సిండికేట్గా మారి రేషన్ విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం. పేదల పొట్ట కొట్టి ఇలా వ్యాపారం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
News February 28, 2026
గద్వాల్: అదృశ్యమైన యువకుడి సూసైడ్..!

గద్వాల మండలం గుంటుపల్లికి చెందిన బొల్లెద్దుల రోహిత్ (24) ఇటీవల అదృశ్యం కాగా అతడి తండ్రి బొల్లెద్దుల జానీ తన కుమారుడు కనిపించడం లేదని ఈనెల 25న గద్వాల పీఎస్లో కంప్లైంట్ చేశాడు. అయితే రోహిత్ ప్రేమించిన అమ్మాయి తరఫు బంధువుల వేధింపు వల్ల సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయమై రోహిత్ తండ్రి జానీ శనివారం హైదరాబాద్ నాచారం పీఎస్లో ఫిర్యాదు చేశాడు. సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News February 28, 2026
శ్రీకాకుళం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా రూపలత

శ్రీకాకుళం జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిగా (ఐసీడీఎస్ పీడీ) కె.రూపలత శనివారం నియమితులయ్యారు. ప్రస్తుతం రణస్థలం మండలం సీడీపీవోగా విధులు నిర్వర్తిస్తున్న ఈమెకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో పీడీగా పనిచేసిన జయదేవి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఆమెకు కార్యాలయం సిబ్బంది పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.


