News February 28, 2025
VKB: దివ్యాంగులకు గుడ్ న్యూస్.. మిస్ చేసుకోకండి

దివ్యాంగులకు సంబంధించిన పరికరాలను అందించేందుకు అంచనా శిబిరాన్ని మార్చి 3 నుంచి 5 వరకు నిర్వహించనున్నట్లు ట్రైనీ కలెక్టర్ ఉమాహారతి తెలిపారు. ఏడీఐపీ పథకం కింద బ్యాటరీ ఆపరేటెడ్ మోటరైజ్డ్ ట్రై సైకిల్స్, హ్యాండ్ ప్రొపెల్డ్ ట్రైసైకిల్స్, వీల్ చైర్స్, వినికిడి యంత్రాలు సూచించడానికి VKBలోని ధర్మ విద్యాలయంలో 3 రోజుల పాటు శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News March 20, 2025
నాగార్జునసాగర్‌కు భారీగా కేటాయింపులు

నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో వివిధ పనుల కోసం గతేడాది కంటే ఈసారి బడ్జెట్‌ను భారీగా పెంచింది. గతేడాది బడ్జెట్లో రూ.96.07 కోట్లు మాత్రమే కేటాయించిన ప్రభుత్వం ఈసారి వాటిని రూ.297.95 కోట్లకు పెంచింది. ఆ నిధులతో డ్యాం సంబంధిత, ప్రధాన పనులు, కాలువలు, డిస్ట్రిబ్యూటరీల పనులను చేపడతామని ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో సాగర్ ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News March 20, 2025
నెల్లూరు: ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

నెల్లూరు జిల్లాలోని 11 ఆదర్శ పాఠశాలల్లో 2025-2026 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఆర్ బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులలో అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఓసీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీలకు రూ.150 దరఖాస్తు ఫీజు చెల్లించాలన్నారు.
News March 20, 2025
ఆదిలాబాద్: నియోజకవర్గానికి 3500 ఇళ్ల మోక్షం

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యం కనిపిస్తోంది. ప్రభుత్వం అభయహస్తం కింద అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించింది. దీంతో తొలి విడతలో చేపట్టనున్న నియోజకవర్గానికి 3500 చొప్పున ఇళ్ల నిర్మాణానికి మోక్షం లభించనుంది. ఉమ్మడి జిల్లాలో 35 వేల మందికి లబ్ది చేకూరనుంది. గృహజ్యోతి కింద 3.60లక్షల మందికి లాభం జరగనుంది. పింఛన్‌ల లబ్ధిదారుల సంఖ్య రెట్టింపు కానుంది.