News March 20, 2025

VKB: పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ

image

పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. పరీక్ష కేంద్రాలకు వచ్చే సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తినా.. ఇతర అసౌకర్యాలు కలిగినా వెంటనే డయల్ 100కు కాల్ చేయాలన్నారు. పరీక్షలు జరిగే సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని.. కేంద్రాల్లోకి సెల్ఫోన్లో అనుమతి లేదన్నారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ఎస్పీ సూచించారు.

Similar News

News March 31, 2025

నిర్మాత ముళ్లపూడి కన్నుమూత

image

టాలీవుడ్ నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం(68) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మరణించారు. ఆస్ట్రేలియాలో ఉన్న కుమారుడు వచ్చాక బుధవారం కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈయన దివంగత ఈవీవీ సత్యనారాయణకు దగ్గరి బంధువు. నేను, అల్లుడుగారు వచ్చారు, మనోహరం, ఓ చిన్నదానా లాంటి సినిమాలను ముళ్లపూడి నిర్మించారు.

News March 31, 2025

మహబూబ్‌నగర్: భారీ ధర్నాకు బీసీ సంఘం: గోనెల శ్రీనివాసులు

image

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 42 శాతం రిజర్వేషన్లను, కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంటులో అమలు చేయాలని బీసీ సంఘం డిమాండ్ చేసింది. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం నుంచి ఏప్రిల్ 2వ తారీఖున ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరిగే ధర్నా కార్యక్రమానికి బీసీ నాయకులు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోనెల శ్రీనివాసులు, మైత్రి యాదయ్య ముదిరాజ్, మురళి తదితరులున్నారు.

News March 31, 2025

గొల్లప్రోలు: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

గొల్లప్రోలు రైల్వే స్టేషన్ వద్ద రైలు నుంచి జారిపడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. వీక్లి స్పెషల్ రైలు నుంచి విశాఖ జిల్లా మర్రిపాలెంకి చెందిన అనిల్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. అతడు రైలులోని వాష్ బేసిన్ దగ్గరికి రావడంతో ఒక్కసారిగా ట్రైన్ నుంచి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు వివరించారు. సంఘటన ప్రాంతానికి తుని రైల్వే పోలీసులు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

error: Content is protected !!