News March 6, 2025
VKB: పలు మండలాల్లో దంచి కొడుతున్న ఎండలు

మార్చి నెల మొదటి వారంలోని ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. జిల్లాలోని పలు మండలాలలో 33-36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో మధ్యాహ్నం సమయంలో చిన్నారులు, వృద్ధులు సాధ్యమైనంత వరకు బయటకు రావద్దని, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చినా ఎండ వేడిమి నుంచి కాపాడుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Similar News
News January 7, 2026
మెదక్: ఉత్తమ సేవా పథకానికి ఎంపికైన డీఎస్పీ

విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించినందుకు ఉత్తమ సేవా పథకానికి ఎంపికైన మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ను TUWJU నాయకులు బుధవారం ఘనంగా సన్మానించారు. డీఎస్పీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహ్మద్ రియాజుద్దీన్, జిల్లా అధ్యక్షుడు ఇంతియాజుద్దీన్, సబ్దర్ అలీ, యూసుఫ్ అలీలు ఆయనకు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ సేవలను నాయకులు కొనియాడారు.
News January 7, 2026
నెల్లూరు: 15 మండలాలకు స్వచ్ఛ రథాలు.!

ప్రభుత్వం స్వచ్ఛ గ్రామాల సంకల్పంతో స్వచ్ఛ రథాలను అందుబాటులోకి తేనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలోని 15 మండలాల్లో గతంలో ఇంటింటికీ వచ్చి బియ్యం ఇచ్చే వాహనాల మాదిరిగా రథాలను సిద్ధం చేస్తున్నారు. ఈ రథాల్లో చెత్త సేకరణ గది, సరుకులతో కూడిన ప్రత్యేక ర్యాక్ ఉంటుంది. పొడి వ్యర్థాలు, ప్లాస్టిక్ కవర్లు, ఇనుప వస్తువులు అందిస్తే సరుకులు పొందవచ్చు. సరుకులు వద్దనుకుంటే నగదు చెల్లిస్తారు.
News January 7, 2026
ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేత

TG: నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవికి బిగ్ షాక్ తగిలింది. 5 కేసుల్లో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది. అతడికి విదేశాల్లో పౌరసత్వం ఉందని, బెయిల్ ఇస్తే దేశం దాటి పోయే అవకాశం ఉందని పోలీసులు వాదించారు. వారి వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం రవి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.


