News March 6, 2025

VKB: పలు మండలాల్లో దంచి కొడుతున్న ఎండలు

image

మార్చి నెల మొదటి వారంలోని ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది.  జిల్లాలోని పలు మండలాలలో 33-36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో మధ్యాహ్నం సమయంలో చిన్నారులు, వృద్ధులు సాధ్యమైనంత వరకు బయటకు రావద్దని, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చినా ఎండ వేడిమి నుంచి కాపాడుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.  

Similar News

News December 17, 2025

సింగరేణి సీఎండీగా కృష్ణ భాస్కర్ బాధ్యతల స్వీకరణ

image

సింగరేణి సంస్థ సీఎండీగా దేవరకొండ కృష్ణ భాస్కర్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఎండీ ఎన్.బలరామ్ ఏడేళ్ల డిప్యూటేషన్ అనంతరం మాతృ విభాగానికి తిరిగి వెళుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణ భాస్కర్ మంగళవారం సింగరేణి భవన్‌లో బలరామ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. సింగరేణి డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు నూతన సీఎండీకి స్వాగతం పలికారు.

News December 17, 2025

ఐపీఎల్‌లో తెనాలి కుర్రాడు.. గుజరాత్ గూటికి పృథ్వీరాజ్

image

ఐపీఎల్ వేలంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువ క్రికెటర్ యర్రా పృథ్వీరాజ్ మెరిశాడు. ఎడమచేతి వాటం పేసర్ అయిన పృథ్వీరాజ్‌ను ‘గుజరాత్ టైటాన్స్’ జట్టు దక్కించుకుంది. వేలంలో అతన్ని రూ.30 లక్షల ధరకు గుజరాత్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ జట్ల తరఫున ఉన్న పృథ్వీరాజ్.. ఇప్పుడు గుజరాత్ తరఫున బరిలోకి దిగనున్నాడు. దీంతో తెనాలి వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

News December 17, 2025

ఎంపీలందరూ సభలో ఉండాలని కాంగ్రెస్ విప్.. జర్మనీలో రాహుల్!

image

MGNREGA పేరు మార్చే బిల్లు ఒకటీరెండు రోజుల్లో పార్లమెంటు ముందుకు రానుంది. ఈ క్రమంలో రానున్న 3 రోజులు హాజరుకావాలని పార్టీ ఎంపీలకు కాంగ్రెస్ విప్ జారీ చేసింది. కానీ ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ మాత్రం ప్రస్తుతం జర్మనీలో ఉండటం గమనార్హం. దీంతో రాహుల్ విషయంలో LoP అంటే లీడర్ ఆఫ్ పర్యటన్ అని బీజేపీ సెటైర్లు వేసింది. ఆయన నాన్ సీరియస్ పొలిటీషియన్ అని, శాశ్వతంగా వెకేషన్ మోడ్‌లో ఉంటారని విమర్శించింది.