News April 24, 2025
VKB: పురుగుమందు తాగిన కాంగ్రెస్ నాయకుడు

బషీరాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు బహిర్గతం అవుతున్నాయి. అధికార పార్టీలోని కొందరి వల్ల మనస్తాపం చెందిన ఓ నాయకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. గురువారం జరిగిన ఎమ్మెల్యే కార్యక్రమంలో మైలవర్ గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డికి వేదికపై మాట్లాడటానికి అవకాశం ఇవ్వకపోవడంతో మనస్తాపంతో పురుగుమందు తాగాడు. వైద్యం కోసం VKB ఆసుపత్రికి తరలించారు.
Similar News
News April 25, 2025
HYD: పచ్చటి కాపురంలో కలహాల చిచ్చు..!

పెళ్లైన కొన్నేళ్లకే ఆలుమగల మధ్య విభేదాలు పచ్చటి కాపురంలో చిచ్చు పెడుతున్నాయి. చిన్నవాటిని పెద్దగా చూస్తూ కాపురంలో సర్దుకోలేక HYD ఉమెన్ పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నారు. వారికి పోలీసులు కౌన్సెలింగ్ అందిస్తున్నారు. వారి మధ్య అన్యోన్యత దెబ్బతింటుందని, పెళ్లయ్యాక లావు అయ్యావని, అంతకు ముందు నువ్వు ఇలా లేవని ఒకరినొకరు దూషించుకుంటున్నట్లు ఉప్పల్ WPS పోలీసులు తెలిపారు.
News April 25, 2025
దేవతల నగరంగా అమరావతి ప్రసిద్ధి

నవ్యాంధ్ర రాజధాని అమరావతి చరిత్రాత్మకంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. శాతవాహనుల రాజధానిగా పేరు పొందింది. దేవతల నగరంగా ఖ్యాతి గాంచింది. బౌద్ధ మతం ఇక్కడ విలసిల్లింది. గుంటూరు జిల్లా పరిధిలో కృష్ణా నది పక్కనే ఉన్న అమరావతి ఎన్నో విశిష్టతలు కలిగి ఉంది. బౌద్ధ స్తూపం, మ్యూజియం, ధ్యాన బుద్ధ విగ్రహం ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి. ఇక్కడి అమరలింగేశ్వర దేవాలయం దేశంలోని పంచారామ క్షేత్రాలలో ఒకటిగా పేరుంది.
News April 25, 2025
బెట్టింగ్ యాప్‌లపై విచారణ.. మెట్రో ఎండీకి నోటీసులు

TG: హైదరాబాద్ మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్ ప్రకటనలపై దాఖలైన పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం బెట్టింగ్ యాప్‌లను నిషేధించినా మెట్రో రైళ్లలో ప్రకటనలు రావడంపై కోర్టు మండిపడింది. ఆ ప్రకటనలకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ మెట్రో ఎండీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి దర్యాప్తు జరగాల్సి ఉందని పేర్కొంది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.