News April 3, 2025
VKB: పెద్దేముల్‌లో మిస్టరీగా మహిళ మృతి!

పెద్దేముల్ మండల కేంద్రంలోని కోట్‌పల్లి ప్రాజెక్టు కాలువలో బుధవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. సదరు మహిళను అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. DSP బాలకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ బృందం వివరాలు సేకరించారు. మహిళ ముఖం, చేతిని కాల్చివేసినట్లు గుర్తించారు. మృతదేహాన్ని తాండూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Similar News
News April 11, 2025
కృష్ణా: 15 నుంచి సముద్రంలో వేట నిషేధం

సముద్రంలో మత్స్య సంపద సంతానోత్పత్తి నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో వేట నిషేధం అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 61 రోజుల పాటు సముద్రంలో వేట నిషేధం అమలులో ఉంటుందన్నారు. ఎటువంటి యాంత్రిక పడవల ద్వారా సముద్రంలో వేటకు వెళ్లరాదన్నారు. నిషేదాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు.
News April 11, 2025
రామరాజ్యం తీసుకురావడమే నా కోరిక: CBN

AP: రాష్ట్రంలో రామరాజ్య స్థాపనే తన కోరిక అని సీఎం చంద్రబాబు అన్నారు. ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణోత్సవంలో సతీసమేతంగా పాల్గొని ఆయన మాట్లాడారు. ఒంటిమిట్టలో టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసి, టూరిజం హబ్‌గా మార్చుతామని చెప్పారు. తిరుమలలో లాగ ఇక్కడ కూడా నిత్య అన్నదానం నిర్వహించాలని టీటీడీ బోర్డును కోరారు.
News April 11, 2025
PHOTO: ధోనీ నాటౌట్?

సీఎస్కే కెప్టెన్ ధోనీ ఔట్ చర్చనీయాంశంగా మారింది. నరైన్ బౌలింగ్‌లో ఎల్బీ అప్పీల్ చేయగా అంపైర్ ఔట్ ఇచ్చారు. ధోనీ రివ్యూ కోరగా రీప్లే పరిశీలించిన థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించారు. అయితే రీప్లేలో బంతి బ్యాటు పక్క నుంచి వెళ్తున్న క్రమంలో అల్ట్రాఎడ్జ్‌లో కాస్త హెచ్చుతగ్గులు ఉన్నట్లు వీడియోలో కనిపించాయి. దీంతో క్లియర్ ఎడ్జ్ అయిందని, ఆయన నాటౌట్ అని పలువురు ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి మీరేమంటారు?