News March 17, 2025

VKB: పెన్సిల్స్ లోడ్ పంపిస్తామని సైబర్ నేరగాళ్ల బురిడీ

image

పెన్సిల్స్ లోడ్ పంపిస్తామని ఓ గృహిణిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. పెద్దేముల్ మండల పరిధిలోని నాగులపల్లికి చెందిన యూనుస్ భార్య స్నాప్ చాట్ చూస్తున్న క్రమంలో ఓ లింకును ఓపెన్ చేశారు. పెన్సిల్ లోడ్ మీ వద్దకు వస్తుందని.. అవి ప్యాక్ చేస్తే నెలకు రూ.30 వేల వేతనం ఇస్తామంటూ నమ్మబలికారు. ఐడీ కార్డు ఇతరత్రా వాటికోసం రూ.13వేలు చెల్లించారు. కాగా, మోసపోయిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News September 19, 2025

కాకినాడ: టీడీపీలో చేరనున్న కర్రి పద్మశ్రీ

image

కాకినాడకు చెందిన ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ఇవాళ సాయంత్రం టీడీపీలో చేరుతున్నారు. వైసీపీ హయాంలో గవర్నర్ కోటాలో ఆమె ఎమ్మెల్సీ అయ్యారు. అనంతరం ఎమ్మెల్సీ పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు. శుక్రవారం సాయంత్రం అసెంబ్లీ ముగిసిన తర్వాత సీఎం సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు ఎమ్మెల్సీ పద్మశ్రీ భర్త నారాయణరావు Way2Newsకు ఫోన్‌లో తెలియజేశారు. కాగా ఆమె రాజీనామాను మండలి ఛైర్మన్ ఇంకా ఆమోదించలేదు.

News September 19, 2025

నెల్లూరు జిల్లాలో వేగంగా MSME పార్కులు

image

సీఎం చంద్రబాబు విజన్-2047లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒక MSME పార్క్ లేదా ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ సముదాయం ఏర్పాటు లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా కృషి చేస్తోంది. ఇప్పటికే ఆత్మకూరు నారంపేటలో పారిశ్రామికవాడ, నెల్లూరు అర్బన్‌ భగత్‌సింగ్ కాలనీలో రూ.12 కోట్లతో జీ+2 ఫ్యాక్టరీ షెడ్స్ నిర్మాణం జరుగుతుండగా, ఆమంచర్లలో 59 ఎకరాల్లో MSME పార్క్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. మిగిలిన నియోజకవర్గాల్లో ప్రతిపాదన దశలో ఉన్నాయి.

News September 19, 2025

దసరా సెలవులు పొడిగించాలని డిమాండ్!

image

తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలకు దసరా సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. APలో ఈనెల 22-OCT2 వరకు సెలవులిచ్చి, 3న రీఓపెన్ చేస్తామని పేర్కొన్నాయి. అయితే, పండుగ 2వ తేదీనే ఉందని.. సొంతూళ్లు, బంధువుల ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు మరుసటిరోజే ఎలా వస్తారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. 4వ తేదీ వరకైనా హాలిడేస్ పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. TGలో స్కూళ్లకు ఈనెల 21-OCT3 వరకు సెలవులిచ్చారు.