News February 18, 2025
VKB: పోలేపల్లి ఎల్లమ్మ జాతరకు ఏర్పాట్లు

వికారాబాద్ మేడారం జాతరకు దుద్యాల్ ముస్తాబవుతోంది. కొడంగల్ నియోజకవర్గ పరిధి దుద్యాల్లోని పోలేపల్లి ఎల్లమ్మ జాతరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి 24 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. 20న అమ్మవారి పల్లకిసేవ, 21, 22 రథోత్సవం, 23 ప్రత్యేక పూజలు, 24న అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వేడుకల్లో పాల్గొంటారని సమాచారం. ఈ మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News October 22, 2025
సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడిలా ఎలా మారాడు?

పూర్వకాలంలో సంవత్సర ప్రారంభాన్ని కృత్తికా నక్షత్రంతో లెక్కించేవారు. ఈ నక్షత్రం పేరు మీదుగానే ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. ఈ నక్షత్రం ఆరు తారల సమూహం. ఈ ఆరు తారలే ఆరు తలలు గల సుబ్రహ్మణ్య స్వామికి తల్లిలా పాలు ఇచ్చాయట. ఈ అనుబంధం వల్లే సుబ్రహ్మణ్య స్వామికి ‘కార్తికేయ’ అనే నామం సిద్ధించిందని పురాణాలు చెబుతున్నాయి. ☞ ఇలాంటి ఆసక్తికర ఆధ్యాత్మిక స్టోరీల కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 22, 2025
ఛోక్సీ కోసం ఆర్థర్ రోడ్ జైలు సిద్ధం!

ఆర్థిక నేరస్థుడు మెహుల్ <<18037252>>ఛోక్సీ<<>> కోసం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు సిద్ధమైంది. బ్యారక్ నం-12లో ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. ఇందులో 2 రూములు ఉండగా అటాచ్డ్ బాత్రూమ్ ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలను అధికారులు బెల్జియం ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు. త్వరలోనే ఛోక్సీని భారత్‌కు బెల్జియం అప్పగించే అవకాశం ఉంది. ఇక అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆర్థర్ రోడ్ జైలులోనే గతంలో 26/11 నిందితుడు అజ్మల్ కసబ్‌ను ఉంచారు.
News October 22, 2025
సిరిసిల్ల అదనపు కలెక్టర్‌గా గరిమా అగర్వాల్

రాజన్న సిరిసిల్ల జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్‌గా గరిమా అగర్వాల్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఈమె ప్రస్తుతం సిద్దిపేట జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న ఈ పోస్టులో ఆమెను నియమించారు.