News February 18, 2025

VKB: పోలేపల్లి ఎల్లమ్మ జాతరకు ఏర్పాట్లు

image

వికారాబాద్ మేడారం జాతరకు దుద్యాల్ ముస్తాబవుతోంది. కొడంగల్ నియోజకవర్గ పరిధి దుద్యాల్‌లోని పోలేపల్లి ఎల్లమ్మ జాతరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి 24 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. 20న అమ్మవారి పల్లకిసేవ, 21, 22 రథోత్సవం, 23 ప్రత్యేక పూజలు, 24న అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వేడుకల్లో పాల్గొంటారని సమాచారం. ఈ మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News

News March 17, 2025

కర్నూలు జిల్లాలో తొలిరోజే ఇద్దరు డీబార్

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు సోమవారం మొదలయ్యాయి. మొదటి రోజే తెలుగు పరీక్షకు 700 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జొన్నగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చూచిరాతకు పాల్పడిన ఓ విద్యార్థిని ఆర్జెడీ డీబార్ చేశారు. కర్నూలు సీఆర్ఆర్ మున్సిపల్ పాఠశాలలో చూచిరాతకు పాల్పడిన విద్యార్థిని డీఈవో శామ్యూల్ పాల్ గుర్తించారు. ఆ విద్యార్థిని సైతం డీబార్ చేయగా.. జొన్నగిరిలో టీచర్‌ను సస్పెండ్ చేశారు.

News March 17, 2025

డీలిమిటేషన్‌పై అఖిల పక్ష సమావేశం

image

TG: డీలిమిటేషన్ అంశంపై డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశం జరిగింది. బీఆర్ఎస్, బీజేపీ మినహా అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ అంశంపై ఇలాంటి సమావేశాలు ఇంకా కొనసాగుతాయని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తెలిపారు. డీలిమిటేషన్‌పై తమిళనాడులో జరిగే సమావేశానికి రాష్ట్ర ప్రతినిధుల బృందం వెళ్తుందని, ఒక్కో పార్టీ నుంచి ఒక్కొక్కరు హాజరవుతారని చెప్పారు.

News March 17, 2025

రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

image

ఉమ్మడి కరీంనగర్,​ మెదక్,​ నిజామాబాద్,​ ఆదిలాబాద్​ టీచర్స్​ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య సోమవారం రాష్ట్ర గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మను కలిశారు. ఎమ్మెల్సీగా విజయం సాధించిన తర్వాత తొలిసారిగా బొకే ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గవర్నర్‌కు విద్యారంగ, టీచర్ల సమస్యలు విన్నవించారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు పెంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

error: Content is protected !!