News February 17, 2025
VKB: ‘ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి’

ప్రజా ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కల్లెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో జిల్లాలో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి 98 ఫిర్యాదులు వచ్చాయన్నారు. జిల్లాలో పలు గ్రామాల ప్రజలు ఇచ్చిన భూసమస్యలపై ఫిర్యాదులను పరిశీలించారు. ఆన్లైన్ రికార్డు చెక్ చేసి, ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేసి రిపోర్ట్ పంపించాలని ఆదేశించారు.
Similar News
News April 16, 2026
పెద్ది రిలీజ్ డేట్ అందుకే ప్రకటించలేదా?

రామ్ చరణ్, బుచ్చి బాబు కాంబోలో వస్తున్న ‘పెద్ది’ రిలీజ్‌ను సినిమా యూనిట్ జూన్‌కు వాయిదా వేసింది. కానీ డేట్‌ను మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికే 2సార్లు పోస్ట్‌పోన్ అయిన నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని టాక్. జూన్ 4న యశ్ నటించిన ‘టాక్సిక్’ రిలీజ్ కానుంది. అది కూడా వాయిదా పడే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో క్లాష్ అవ్వకుండా ప్లాన్ చేయాలని పెద్ది యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.
News April 16, 2026
ఎన్టీఆర్: ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి

ఎన్టీఆర్ జిల్లా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల 2026 ఫలితాల్లో అమ్మాయిలు మరోసారి ఆధిక్యం చాటుకున్నారు. మొదటి సంవత్సరం ఇంటర్‌లో అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 85%గా నమోదవగా, అబ్బాయిలు 80% మాత్రమే సాధించారు. రెండో సంవత్సరం ఇంటర్‌లో కూడా అమ్మాయిలు 87% ఉత్తీర్ణతతో ముందంజలో నిలిచారు, అబ్బాయిల ఉత్తీర్ణత 84%గా ఉంది. మొత్తం చూసుకుంటే అమ్మాయిలు 86% ఉత్తీర్ణత సాధించగా, అబ్బాయిలు 82% మాత్రమే సాధించడం గమనార్హం.
News April 16, 2026
సీబీఎస్‌ఈ ఫలితాల్లో తాళ్ల పద్మావతి స్కూల్ సత్తా

సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాల్లో తాళ్ల పద్మావతి పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. విద్యార్థులు అఫియా(485), నిత్య(473), కార్తిక(472), నిగ్నేశిత(469) అత్యుత్తమ మార్కులతో రాణించారు. ఈ సందర్భంగా విద్యార్థులను, ఉపాధ్యాయులను విద్యాసంస్థల చైర్మన్ తాళ్ల మల్లేశం, డైరెక్టర్లు డా.వంశీ, చైతన్య, డా.వరుణ్, వైష్ణవి అభినందించారు.


