News March 19, 2025
VKB: బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి చేరిన పంచాయతీ

బీజేపీ జిల్లా పంచాయతీ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి చేరుకుంది. వికారాబాద్ నూతన జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి నియామకాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా నాయకులు హైదరాబాద్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. జిల్లా అధ్యక్షున్ని మార్పు చేసేవరకు పార్టీ ఆఫీసులో నిరసన తెలుపుతామని నాయకులు స్పష్టం చేసినట్లుగా తెలిసింది. రాజశేఖర్ రెడ్డి స్థానికేతరుడు అని, నూతనంగా పార్టీలోకి వచ్చాడని వివాదం కొనసాగుతుంది.
Similar News
News March 20, 2025
పుంగనూరు: కోర్టులో లొంగిపోయిన నిందితురాలు

పుంగనూరు మండలంలోని కృష్ణాపురంలో రామకృష్ణ హత్యకేసులో నిందితురాలైన రజిని బుధవారం న్యాయవాది శివప్పనాయుడు ద్వారా కోర్టులో లొంగిపోయింది. రికార్డులు పరిశీలించిన అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి వంశీకృష్ణ ఆమెను జుడీషియల్ కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ హత్య కేసులో నిందితులైన త్రిలోక, మహేశ్‌ను అరెస్టు చేసినట్లు పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ చెప్పారు.
News March 20, 2025
నరసరావుపేట యువకుడికి గేట్‌లో 6వ ర్యాంకు

గేట్ పరీక్ష ఫలితాల్లో నరసరావుపేటకు చెందిన జస్వంత్ భవాని అఖిల భారత స్థాయిలో 6వ ర్యాంక్ సాధించాడు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహించిన 2025 గేట్ పరీక్ష ఫలితాలను బుధవారం అధికారికంగా విడుదల చేశారు. ఈ పరీక్షా ఫలితాల్లో పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన జస్వంత్ భవాని అత్యుత్తమ ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు బంధువులు హర్షం వ్యక్తం చేశారు.
News March 20, 2025
HYD: ఓయూ బంద్‌కు పిలుపు

ఓయూలో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిషేధం అని అధికారులు విడుదల చేసిన సర్క్యూలర్‌పై వ్యతిరేకత పెరుగుతోంది. ఇటీవల ABVP బంద్‌కు పిలుపునివ్వగా ఎక్కడికక్కడ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు SFI, AISF, PDSU, PDSU(V)AIDSO, PSU సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఓయూ విద్యార్థుల గొంతులు నొక్కే అప్రజాస్వామిక సర్క్యూలర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.