News April 3, 2025

VKB: భారీ వర్షాలు.. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు

image

వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నందున జిల్లా కలెక్టరేట్లో 08416242136 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. జిల్లాలో వర్షాలు పడుతున్నందున ఎక్కడైనా సమస్య ఏర్పడితే కంట్రోల్ రూమ్‌కు కాల్ చేస్తే సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. 24 గంటలకు ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

Similar News

News October 29, 2025

రేపు యథావిధిగా పాఠశాలలు: నంద్యాల డీఈవో

image

నంద్యాల కలెక్టర్ రాజకుమారి గనియా ఆదేశాల మేరకు జిల్లా పరిధిలోని అన్ని యాజమాన్య పాఠశాలలు రేపటి నుంచి యథావిధిగా పనిచేయాలని డీఈవో జనార్దన్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆయన బుధవారం ప్రకటన విడుదల చేశారు. పాఠశాల నిర్వహణకు ఇబ్బందులు ఉంటే గురువారం సెలవు ఇవ్వాలని ఉప విద్యాశాఖాధికారులు, ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.

News October 29, 2025

తొర్రూరు-నర్సంపేట రాకపోకలు బంద్

image

తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో తొర్రూరు- నర్సంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అమ్మపురం- బొత్తలతండా సమీపంలోని కల్వర్టులో నీటి ప్రవాహం పెరిగి ప్రమాద స్థాయికి చేరుకుంది. అప్రమత్తమైన పోలీసులు రహదారికి రెండు వైపులా ట్రాక్టర్లను ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. గుర్తూరు ఈదులవాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలను మళ్లిస్తున్నారు.

News October 29, 2025

రేపటి నుంచి జిల్లాలో స్కూల్స్ యథాతధం: డీఈవో

image

మొంథా తుఫాను తీరం దాటిన నేపథ్యంలో జిల్లాలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొనడంతో రేపటి నుంచి స్కూల్స్ యథాతధంగా పనిచేస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఈ.నారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత ఈనెల 31 వరకు సెలవులు ప్రకటించినప్పటికీ ప్రస్తుతం వాతావరణం నెమ్మదించడంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు గురువారం నుంచి యథాతధంగా పనిచేస్తాయని చెప్పారు.