News April 8, 2025
VKB: భార్యను పంపకపోవడంతో మామను హత్య చేసిన అల్లుడు

దోమ మండలంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పుట్టింటికి వెళ్లిన భార్యను పంపకపోవడంతో మామపై కక్ష పెంచుకుని హత్య చేసినట్లు నిందితుడు ఎడ్ల మల్లేశ్ అంగీకరించాడని పరిగి సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం రాత్రి నిద్రిస్తున్న మొగులయ్యను అల్లుడు మోత్కూర్ వాసి మల్లేష్ హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు. భార్యాభర్తల విషయంలో మామ అడ్డు వస్తున్నాడని కక్షతో గొడ్డలితో నరికి చంపినట్లు వివరించారు.
Similar News
News October 17, 2025
SRPT: మీరాబాయి వేషంలో వచ్చి.. పాఠం బోధించి

విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యేందుకు ఓ ఉపాధ్యాయురాలు విచిత్ర వేషధారణతో ఆకట్టుకున్నారు. తుంగతుర్తి(M) వెలుగుపల్లి ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయురాలు కర్పూరపు నివేదిత.. 10వ తరగతిలో మీరాబాయి రచించిన ‘భక్తిపథ్’ పాఠం బోధించేందుకు మీరాబాయి వేషంలో తరగతి గదికి వచ్చారు. టీచర్ను చూసి మొదట అవాక్కైన విద్యార్థులు.. కాసేపటికి గుర్తుపట్టి ఆశ్చర్యపోయారు. ఆమె వినూత్న బోధనను అందరూ అభినందించారు.
News October 17, 2025
ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో స్పాట్ అడ్మిషన్లు

సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, పీజీ కళాశాలలో ఈ విద్యాసంవత్సరం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మొదటి సంవత్సరంలో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాళ్లు ఎస్.జ్యోతి, నర్సింహాచారి తెలిపారు. ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామన్నారు.
News October 17, 2025
GNT: అంగన్వాడీ అద్దె బకాయిలు రెండు రోజుల్లో జమ

గుంటూరు జిల్లాలోని ప్రైవేటు భవనాల్లో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాల అద్దె బకాయిలను రెండు రోజుల్లోకార్యకర్తల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి పి.వి.జి. ప్రసున తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే బకాయిల విడుదలకు బడ్జెట్ను విడుదల చేసిందని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంపై సిబ్బందికి తెలియజేయాలని అధికారులను ఆదేశించినట్లు వివరించారు.