News February 20, 2025
VKB: మహిళలు స్వయం ఉపాధిని అందుకోవాలి: స్పీకర్

వికారాబాద్ నియోజకవర్గానికి చెందిన SC కార్పోరేషన్ సహకారంతో ఉచిత కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న 105 మంది SC మహిళలకు కుట్టు మిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పంపిణీ చేశారు. అనంతరం వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ప్రతి మహిళా ఆర్థిక స్వేచ్చ కలిగి ఉండాలని అందుకోసం మహిళలు స్వయం ఉపాధి మార్గాలను అందుకోవాలని సూచించారు. మహిళలకు స్వయం ఉపాధిలో ప్రోత్సాహం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్ అన్నారు.
Similar News
News January 10, 2026
విశాఖ: 12 నుంచి జిల్లా స్థాయి పోటీలు

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సంక్రాంతి సందర్భంగా జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పోటీలు పాండురంగపురం వద్ద సోమవారం నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రచార పోస్టర్‌ను విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆవిష్కరించారు. గాలిపటాలు ఎగురు వేయుట, తొక్కుడు బిళ్ల, ఏడు పెంకులాట, తాడు లాగుట, కర్ర సాము పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
News January 10, 2026
రాష్ట్ర అండర్-17 ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్‌గా నల్గొండ వాసి

అనుముల మండలంలోని హాలియా పట్టణానికి చెందిన చింతలచెరువు తేజు తెలంగాణ రాష్ట్ర అండర్-17 ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఈ నెల 12 నుంచి 16 వరకు హరియాణాలో జరిగే 69వ జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో ఆయన జట్టుకు నాయకత్వం వహించనున్నారు. గత నవంబర్‌లో నల్గొండలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచినందుకు గాను తేజుకు ఈ గౌరవం దక్కింది. జాతీయ స్థాయిలో రాణించాలని పలువురు ఆకాంక్షించారు.
News January 10, 2026
అనంతపురం: గుండెపోటుతో SI మృతి

అనంతపురం జిల్లా పోలీస్ కంట్రోల్ రూం SI మోహన్ ప్రసాద్ విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుతో కన్నుమూశారు. అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఎస్సై మృతి పట్ల జిల్లా ఎస్పీ జగదీశ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆ కుటుంబానికి సానుభూతి తెలిపారు. జేఎన్టీయూ రోడ్డులో పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అధికారులు, సహచర సిబ్బంది నివాళులర్పించారు.


