News March 9, 2025
VKB: రేషన్ కార్డ్ దరఖాస్తులపై క్షేత్ర స్థాయిలో పరిశీలన

జిల్లాలో ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి సిద్ధమవుతోన్న తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మీ సేవా కేంద్రాల ద్వారా స్వీకరించిన దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణకు ఏర్పాట్లు చేస్తోంది. సివిల్ సప్లై అధికారులు ఇంటింటికీ వెళ్లి దరఖాస్తుదారులను విచారిస్తారు. కాగా కొత్త రేషన్ కార్డులు అందించడానికి ప్రజాపాలన, ప్రజావాణి, గ్రామసభల ద్వారా దరఖాస్తులు ఇంతకు ముందే స్వీకరించింది.
Similar News
News March 17, 2026
HYD: నేటి నుంచే ’24 స్పీడ్ పోస్ట్’ సేవలు..!

తక్షణ, అత్యవసర డెలివరీల కోసం ఇండియా పోస్ట్ నేటి నుంచి 24, 48 గంటల స్పీడ్ పోస్ట్ సేవలను ప్రారంభించనుంది. మొదటి దశలో హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో అందుబాటులోకి రానున్న ఈ సేవలు ఒకటి నుంచి రెండు రోజుల్లో వస్తువులను చేరవేస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో OTP ఆధారిత సెక్యూర్ డెలివరీ, SMS ట్రాకింగ్, ఆలస్యమైతే డబ్బు తిరిగి ఇచ్చేసే వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు.

విశాఖ: రైల్వే ట్రాక్‌పై వ్యక్తి ఆత్మహత్య

విశాఖపట్నం మర్రిపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్‌పై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 40-45 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి పేరు, చిరునామా తెలియరాలేదని జీఆర్‌పీ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిసిన వారు 93463 48929 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు.