News April 10, 2025
VKB: రేషన్ షాపులకు క్యూ కడుతున్నారు

సన్న బియ్యం పంపిణీతో వికారాబాద్ జిల్లాలోని రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులు క్యూ కడుతున్నారు. జిల్లాలో 2,48,122 రేషన్ కార్డులు ఉండగా 580 రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ కొనసాగుతుంది. గతంలో పంపణీ చేసిన దొడ్డు బియ్యం తీసుకునేందుకు జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. సన్న బియ్యం పంపిణీ ప్రారంభం నుంచి ఎప్పుడు చూసినా రేషన్ షాపులు ప్రజలతో రద్దీగా ఉంటున్నాయి. ఈ బియ్యం బాగున్నాయని జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 27, 2025
కంబోడియా సూత్రధారి.. ప.గోలో 13 మంది అరెస్టు

భీమవరానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి శర్మ నుంచి రూ.78 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్ల గుట్టును పోలీసులు రట్టు చేశారు. కంబోడియాకు చెందిన ప్రధాన సూత్రధారి రహేత్ జె నయన్ సహకారంతో.. ‘కార్డ్ డీల్’ పద్ధతిలో ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ కేసులో మొత్తం 13 మందిని అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
News November 27, 2025
వరంగల్: మార్కెట్లో మిర్చి ధరలు ఇలా..!

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో గురువారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు బుధవారం రూ.17,100 ధర రాగా.. నేడు రూ.17,500 అయింది. అలాగే, వండర్ హాట్(WH) మిర్చికి నిన్న రూ.18,500 ధర రాగా, ఈరోజు కూడా అదే ధర వచ్చింది. మరోవైపు తేజ మిర్చికి నిన్న రూ.15,100 ధర వస్తే.. గురువారం రూ.14,700 అయింది. కొత్త తేజా మిర్చికి రూ.17,001 ధర పలికింది.
News November 27, 2025
వరంగల్: క్వింటా పత్తి ధర రూ.6,980

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. సోమవారం, మంగళవారం క్వింటా పత్తి ధర రూ.6,880 పలకగా.. బుధవారం రూ.6,925కి చేరింది. ఈరోజు మరింత పెరిగి రూ.6,980 అయింది. ధరలు పెరగడం అన్నదాతలకు ఉపశమనం కలిగించే విషయమైనప్పటికీ, ఆశించిన స్థాయిలో ధర రావట్లేలేదని వాపోతున్నారు. ధర రూ.8 వేలు రావాలని ఆకాంక్షిస్తున్నారు.


