News April 10, 2025

VKB: రేషన్ షాపులకు క్యూ కడుతున్నారు

image

సన్న బియ్యం పంపిణీతో వికారాబాద్ జిల్లాలోని రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులు క్యూ కడుతున్నారు. జిల్లాలో 2,48,122 రేషన్ కార్డులు ఉండగా 580 రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ కొనసాగుతుంది. గతంలో పంపణీ చేసిన దొడ్డు బియ్యం తీసుకునేందుకు జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. సన్న బియ్యం పంపిణీ ప్రారంభం నుంచి ఎప్పుడు చూసినా రేషన్ షాపులు ప్రజలతో రద్దీగా ఉంటున్నాయి. ఈ బియ్యం బాగున్నాయని జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News April 17, 2026

జగిత్యాల: డిప్లోమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దుర్గాబాయి దేశ్‌ముఖ్ ప్రభుత్వ మహిళా టెక్నికల్ శిక్షణ సంస్థ HYDలో పాలిటెక్నిక్ డిప్లోమా కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి నరేశ్ తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ బాలికలు, అక్రమ రవాణాకు గురైన బాధిత బాలికలు, వికలాంగుల బాలికలు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

News April 17, 2026

NZB: ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు: కవిత

image

ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఆరు నెలల్లోపు పీఆర్సీని అమలు చేస్తామని హామీ ఇచ్చి 28 నెలల గడుస్తున్నా మాట ఎత్తడం లేదన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ శుక్రవారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు చేపట్టే నిరసన ప్రదర్శనకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు కవిత ట్వీట్ చేశారు.

News April 17, 2026

నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల నిరసన

image

TGE-JAC పిలుపు మేరకు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ప్రభుత్వ మొండి వైఖరి వీడి PRC, పెండింగ్ బకాయిలు, హెల్త్ కార్డుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో STU జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి ధర్మేందర్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.