News March 7, 2025

VKB: రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలి: కలెక్టర్

image

రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యతను పాటిస్తూ సకాలంలో పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. నాణ్యతను క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఆదేశించారు. R&B, పంచాయతీ రాజ్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Similar News

News October 15, 2025

PCC చీఫ్ సబ్జెక్టు తెలుసుకుని మాట్లాడాలి: MP

image

రాష్ట్ర PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ROB నిధులపై సరైన అవగాహన లేదని, ముందుగా సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడాలని నిజామాబాద్ MP అరవింద్ ధర్మపురి సూచించారు. బుధవారం MP మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం BJPపై బురద జల్లి BRSను కాపాడే ప్రయత్నం చేస్తుందని, కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వమే కమిటీ వేసి అవకతవకలు ఉన్నాయని తేలినా ఏమి చేయలేదన్నారు.

News October 15, 2025

నిధులు ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తా: MP

image

NZB జిల్లాలోని ROBలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుంటే వారంలో నిరాహార దీక్ష చేపడుతానని MP ధర్మపురి అర్వింద్ ప్రకటించారు. BJP జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. అడవి మామిడిపల్లి ఆర్ఓబీకి రూ.22 కోట్లు అవసరమైతే, కొన్ని ఏళ్ల క్రితమే సుమారు రూ.18 కోట్లు డిపాజిట్ చేయగా గత ప్రభుత్వం నిధులను మళ్లించిందన్నారు. మాధవ్ నగర్ ఆర్ఓబీకి కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో 70% వచ్చాయన్నారు.

News October 15, 2025

జూబ్లీహిల్స్‌లో KCR రోడ్ షోకు PLAN

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRS అభ్యర్థి మాగంటి సునీత తరఫున ఆ పార్టీ ఈనెల 19న భారీ రోడ్‌షోకు ఏర్పాట్లు చేసింది. ఇందులో BRS చీఫ్ KCR పాల్గొంటారనే టాక్ వినిపిస్తోంది. ప్రతిష్ఠాత్మక పోరులో గెలిపే లక్ష్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఇప్పటికే జూబ్లీ బరిలో పావులు కదుపుతున్నారు. గత అనుభవాల దృష్ట్యా KCR తప్పకుండా జూబ్లీహిల్స్‌లో ఎంట్రీ ఇస్తారని కార్యకర్తలు ఆశాగా చూస్తున్నారు.