News March 28, 2025
VKB: “షబ్ -ఏ -ఖదర్” వేడుకలు

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా “షబ్ -ఏ -ఖదర్” వేడుకలు రాత్రి భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ముస్లింలు మసీదులను రంగులు, విద్యుత్ దీపాలతో ముస్తాబు చేసి, రాత్రంతా మసీదుల్లోనే జాగరణ చేస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అన్ని మసీదుల్లోను రాత్రి జాగరణ కోసం ఏర్పాట్లు చేశారు. తరవీహ్ నమాజ్ అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం మత పెద్దలను ఘనంగా సన్మానించారు.
Similar News
News December 6, 2025
తిరుపతి: నీట మునిగిన 5046 హెక్టార్లలో వరి.!

దిత్వా తుఫాన్ ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా వరి పంట 5046 హెక్టార్లలో నీట మునిగిందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ప్రసాద్ తెలిపారు. వరినారు 250 ఎకరాలు నష్టం వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఆదివారం సాయంత్రానికి నీరు తగ్గాక పూర్తి అవగాహన వస్తుందన్నారు. వరి నారు నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
News December 6, 2025
శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు అలర్ట్

శ్రీకాకుళం జిల్లా మీదుగా విశాఖకు నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఆ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. గరివిడి-సిగడాం-చీపురుపల్లి మధ్య భద్రతకు సంబంధించిన పనుల నేపథ్యంలో విశాఖ-పలాస-విశాఖ(67289/90) మెము రైలు, విశాఖ-బ్రహ్మపూర్-విశాఖ(58531/32) ప్యాసింజర్ రైలు, విశాఖ-బ్రహ్మపూర్-విశాఖ(18525/26) ఎక్స్ప్రెస్ ట్రైన్లు డిసెంబర్ 6-8వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.
News December 6, 2025
ఉద్యోగులకు ఆ హక్కు ఉండాలి.. లోక్సభలో బిల్లు

పని వేళలు పూర్తయ్యాక ఉద్యోగులకు వచ్చే ఆఫీసు కాల్స్కు సంబంధించి ప్రైవేటు మెంబర్ బిల్లు లోక్సభ ముందుకు వచ్చింది. ‘Right to Disconnect Bill-2025’ను NCP ఎంపీ సుప్రియా సూలే ప్రవేశపెట్టారు. పని వేళల తర్వాత, హాలిడేస్లో వర్క్ కాల్స్, ఈమెయిల్స్ నుంచి డిస్ కనెక్ట్ అయ్యే హక్కు ఉద్యోగులకు ఉండాలని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అథారిటీని ఏర్పాటు చేయాలని కోరారు.


