News February 18, 2025

VKB: సంత్ సేవాలాల్ చూపిన మార్గం ఆదర్శనీయం: కలెక్టర్

image

సంత్ సేవాలాల్ మహారాజ్ ఇచ్చిన బోధనలు, ఆచరణలను పాటిస్తూ సమాజ సేవకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం వికారాబాద్ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో చేపట్టిన కార్యక్రమంలో కలెక్టర్ సంత్ సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Similar News

News March 23, 2025

గుంటుపల్లి: యువతి హత్య కేసులో నిందితులు వీరే

image

గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద 2019లో ప్రేమ జంటపై జరిగిన దాడి చేసి యువతిని హత్య చేసిన కేసులో నలుగురు దోషులకు శుక్రవారం జీవిత ఖైదు విధించారు. ఈ హత్య అప్పట్లో రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. జి.కొండూరుకు చెందిన రాజు, జి.కొత్తపల్లికి చెందిన సోమయ్య, గంగయ్య, అరిసెల గ్రామానికి చెందిన నాగరాజును నిందితులుగా గుర్తించారు. ఈ కేసును పోక్సో కేసుగా పరిగణించి నలుగురికి జీవిత ఖైదు విధించారు.

News March 23, 2025

నరైన్ ‘హిట్ వికెట్’.. ఎందుకు ఔట్ ఇవ్వలేదంటే?

image

నిన్న RCBతో మ్యాచ్‌లో KKR బ్యాటర్ సునీల్ నరైన్ ‘హిట్ వికెట్’పై చర్చ జరుగుతోంది. MCC నిబంధనల ప్రకారం బ్యాటర్ బంతిని ఆడేటప్పుడు లేదా పరుగు తీసే క్రమంలో బ్యాట్ వికెట్లను తాకితేనే హిట్ వికెట్‌గా పరిగణిస్తారు. అయితే నిన్న బంతి నరైన్ పైనుంచి వెళ్లి కీపర్ చేతిలో పడ్డ తర్వాత బ్యాట్ వికెట్లను తాకింది. అప్పటికే అంపైర్ బంతిని వైడ్‌గా ప్రకటించారు. అందుకే దాన్ని నరైన్‌ను నాటౌట్‌గా ప్రకటించారు.

News March 23, 2025

బాపట్ల: సీనియర్ నాయకుడు శ్రీధర్ మృతి

image

బాపట్ల జిల్లా సీపీఐ సీనియర్ నాయకుడు, వ్యవసాయ కార్మిక సంఘాల ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ జేపీ శ్రీధర్ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న సీపీఐ నాయకులు ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ కోసం ప్రజా సమస్యల కోసం నిరంతరం కృషి చేసే శ్రీధర్ మృతి చెందిన బాధాకరమని అన్నారు.

error: Content is protected !!