News December 19, 2024
VKB: సన్నధాన్యం అమ్మినవారు 699 మంది మాత్రమే..!

VKB జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యపు కొనుగోలు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 699 మంది రైతులు మాత్రమే సన్న వరి ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాల వద్ద విక్రయించినట్లు అధికారులు తెలిపారు. సన్న వరి ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ అందిస్తున్నప్పటికీ, బయట మార్కెట్లలో ప్రస్తుత రేటు ఎక్కువగా ఉండటంతో అటువైపు రైతులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 18, 2025
శంషాబాద్ నుంచి సౌదీకి ప్రత్యేక విమానం

సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాద ఘటన బాధితుల కోసం ప్రభుత్వం శంషాబాద్ నుంచి సౌదీకి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారిని గుర్తించి, అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మృతుల రక్త సంబంధికులను ఈరోజు రాత్రి 8.30 గంటలకు నాంపల్లి హజ్ హౌస్ నుంచి సౌదీకి పంపనున్నారు.
News November 18, 2025
శంషాబాద్: గర్భంలోనే కవలలు మృతి.. భర్త ఆత్మహత్య

భార్య గర్భంలోని కవలలు మృతిచెందారనే దుఃఖంతో శంషాబాద్‌లోని సామ ఎన్‌క్లేవ్‌లో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆతహత్య చేసుకున్నాడు. పోలీసుల ప్రకారం.. కర్ణాటకకు చెందిన ముత్యాల విజయ్ భార్య శ్రావ్య 8 నెలల గర్భిణీ. కవలల మరణ వార్త తెలిసి విజయ్ తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.