News April 4, 2025

VKB: సన్న బియ్యం సరఫరా పారదర్శకంగా జరగాలి: కలెక్టర్

image

వికారాబాద్ జిల్లాలో సన్న బియ్యం పంపిణీ పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంత కుమారి వివిధ జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. 

Similar News

News April 21, 2025

HNK: కొప్పుల రాజును కలిసిన ఎమ్మెల్యేలు

image

హనుమకొండలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మన్ కొప్పుల రాజును ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు కలిసి సన్మానించారు. అనంతరం కాసేపు ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలపై ఆయనతో చర్చించారు. వారితో పాటు పలువురు నేతలు ఉన్నారు.

News April 21, 2025

KMR: భూముల సమస్యల పరిష్కారానికి భూ భారతి: కలెక్టర్

image

భూముల సమస్యల పరిష్కారం కోసమే ‘భూ భారతి’ చట్టం ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. పిట్లంలోని రైతు వేదికలో సోమవారం భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గతంలో ధరణిలో కొన్ని లోపాలుండడం వల్ల భూ సమస్యలు పరిష్కారం కాలేదని, ఇప్పుడు ప్రభుత్వం రూపొందించిన భూ భారతిలో వాటిని సరిచేసిందన్నారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి పాల్గొన్నారు.

News April 21, 2025

దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి: ములుగు అడిషనల్ కలెక్టర్

image

ప్రజావాణిలో ఫిర్యాదు చేసే దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ సి.హెచ్. మహేందర్ జి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి మొత్తం 39 దరఖాస్తులలో, అత్యధికంగా రెవిన్యూ సమస్యలపై16, ఉపాధికల్పన కోసం 4, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం 3, ఇతర శాఖల కార్యాలయాలకు సంబంధించినవి 16 దరఖాస్తులు వచ్చాయన్నారు. కొన్ని దరఖాస్తులను ప్రజావాణిలోని పరిష్కరించారు.

error: Content is protected !!