News April 11, 2025
VKB: సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలి: ఎస్పీ

సైబర్ నేరాలపై వెంటనే కేసులు నమోదు చేసి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా ఎస్సీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పెండింగ్ కేసులు లేకుండా వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ముఖ్యంగా సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
Similar News
News November 14, 2025
జూబ్లీహిల్స్: నిరుద్యోగి యువతి అస్మాకు 107 ఓట్లు

కాంగ్రెస్ను ఓడిస్తేనే తమకు సీఎం రేవంత్ రెడ్డి జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తారని చెబుతూ ప్రచారం చేసిన నిరుద్యోగ యువతి, స్వతంత్ర అభ్యర్థి అస్మా బేగంకు 0.05 శాతం అంటే 107 ఓట్లు పోలయ్యాయి. గెలుపు కోసం కాదు నిరుద్యోగుల వాయిస్ను కాంగ్రెస్ ప్రభుత్వానికి వినిపించాలనే తాను జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేస్తానని చెప్పిన అస్మాకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.
News November 14, 2025
కేసీఆర్ ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది: రేవంత్

TG: కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో లేరని, ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రెస్మీట్లో మాట్లాడుతూ ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ను విమర్శించడం భావ్యం కాదు. ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చాక స్పందిస్తా. ఆయన కుర్చీ గుంజుకోవడానికి కేటీఆర్, హరీశ్ ప్రయత్నిస్తున్నారు. వారి పరిస్థితి ఏంటో చూద్దామని జూబ్లీహిల్స్లో నిరూపించుకోవాలని వదిలేశారు’ అని వ్యాఖ్యానించారు.
News November 14, 2025
సంబంధం లేని వ్యక్తులు CID విచారణలో: భూమన

CIDకి సంబంధం లేని వ్యక్తి తిరుమల <<18287141>>పరకామణి <<>>కేసు విచారణ చేపడుతున్నారని భూమన ఆరోపించారు. ‘లక్ష్మణరావు అనే వ్యక్తి విచారణ పేరుతో సతీశ్ను బండబూతులు తిట్టాడు. సీఐడీలో భాగస్వామి కానీ వ్యక్తి విచారణలో ఏవిధంగా పాల్గొంటారు. న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా సీఐడీ అధికారులు విచారణ చేస్తున్నారు’ అని భూమన విమర్శించారు.


