News February 8, 2025
VKB: ‘స్థానిక’ ఎన్నికలు.. కాంగ్రెస్, BRS, BJP మంతనాలు

ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. దీంతో వికారాబాద్ జిల్లాలోని గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష BRS, BJPకి చెందిన ఆశావహులు మంతనాలు జరుపుతున్నారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని గ్రామాల్లోని కొందరు ఆయా పార్టీల ముఖ్యులను కోరుతున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది.
Similar News
News November 3, 2025
ఆన్‌లైన్ పెట్టుబడి మోసం.. విశాఖకు చెందిన వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్‌లైన్ పెట్టుబడి మోసాల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు. గుంటూరుకు చెందిన మడతల రమేష్‌రెడ్డి, విశాఖకు చెందిన గండి శ్రీను, విజయవాడకు చెందిన గుర్రపుకొండ శ్రీధర్ బాధితుల బ్యాంకు ఖాతాల ద్వారా కోట్ల రూపాయలు లావాదేవీలు చేసినట్లు వెల్లడైంది. వీరు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో నకిలీ పెట్టుబడి పథకాలు పేరుతో ప్రజల్ని బురిడీ కొట్టించి నగదు కొట్టేశారు.
News November 3, 2025
NTR: అలర్ట్.. రేపటితో ముగియనున్న గడువు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (దూరవిద్య) పరిధిలోని కళాశాలల్లో జులై, ఆగస్టు 2025లో నిర్వహించిన ఎం.ఏ 1,2,4వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు నవంబర్ 4వ తేదీలోగా ఒక్కో పేపరుకు రూ. 960 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వివరాలకు https://anucde.info/ResultsJAug25.asp చూడాలని వర్సిటీ సూచించింది.
News November 3, 2025
శివాలయాలు, ఘాట్ల వద్ద పోలీసు బందోబస్తు పెంపు: ఎస్పీ

కార్తీక మాసం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాలు, ఇతర ఆలయాల వద్ద, ఘాట్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ నర్సింగ్ కిషోర్ సోమవారం తెలిపారు. కాశీబుగ్గ ఆలయంలో జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకుని, భక్తులు రద్దీగా ఉండే ప్రదేశాలలో భద్రత దృష్ట్యా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. భక్తులు భద్రతా నిబంధనలు పాటించాలని కోరారు.


