News April 14, 2025

VKB: స్పీకర్ ప్రసాద్ కుమార్ పర్యటన వివరాలు

image

తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం 9 గంటలకు తెలంగాణ అసెంబ్లీలో నిర్వహించనున్న అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేస్తారని క్యాంపు కార్యాలయ సిబ్బంది తెలిపారు.

Similar News

News January 8, 2026

మొక్కజొన్నలో భాస్వరం లోపం నివారణ ఎలా?

image

మొక్కజొన్న ఆకులు ఊదా, వంకాయ రంగులోకి మారితే అది భాస్వరం లోపం. చలి తీవ్రత వల్ల భూమిలో భాస్వరం ఉన్నా మొక్క తీసుకోలేదు. దీని వల్ల మొక్కలు ఎదగక వేర్లు బలహీనపడి ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు లీటరు నీటిలో 10గ్రా. DAP లేదా 19:19:19 ఎరువును కరిగించి పంటపై పిచికారీ చేయాలి లేదా నానో DAP లీటరు నీటికి 2ml చొప్పున కలిపి వారం వ్యవధిలో 2సార్లు పిచికారీ చేయాలి. సిలికాన్ జిగురు కలిపి పిచికారీ చేస్తే మరింత లాభం.

News January 8, 2026

‘సూర్యాపేట జిల్లాలో 10 వేల టన్నుల యూరియా నిల్వలు’

image

జిల్లాలో రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ప్రస్తుతం 10 వేల టన్నుల యూరియా నిల్వలు ఉన్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి తెలిపారు. గురువారం కోదాడ మండలంలోని పలు ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేసి, మాట్లాడారు. సొసైటీలు, ప్రైవేట్ డీలర్ల ద్వారా ఎరువుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని, ముందస్తుగానే అవసరమైన మేర యూరియా సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.

News January 8, 2026

సిద్దిపేటపై సీపీ విజయకుమార్ చెరగని ముద్ర

image

సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్.విజయ్‌కుమార్ బదిలీ కావడం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. పదవీ కాలంలో ఆయన కేవలం శాంతిభద్రతలకే పరిమితం కాకుండా, ప్రజా సమస్యల పరిష్కారంలోనూ ప్రత్యేక ముద్ర వేశారు. ముఖ్యంగా ‘Way2News’లో వచ్చిన కథనాలకు తక్షణం స్పందిస్తూ సమస్యలను చక్కదిద్దారు. పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచిన ఆయన బదిలీ వార్తతో జిల్లా ప్రజలు ఒక్కసారిగా భావోద్వేగానికి గురవుతున్నారు.