News March 4, 2025
VKB: స్పోర్ట్స్ స్కూల్‌లో దరఖాస్తుల ఆహ్వానం

వికారాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి వాటర్ స్పోర్ట్స్ అకాడమిలో కాయకింగ్, కెనోయింగ్, ఫెన్సింగ్ మొదలైన వాటర్ స్పోర్ట్స్ నందు గిరిజన బాలబాలికల నుంచి అడ్మిషన్లు కోరుతున్నామని ఆ శాఖ జిల్లా అధికారి కమలాకర్ రెడ్డి తెలిపారు. 5వ తగరతిలో బాలురు10, బాలికలకు 10 సీట్లు ఉండగా, మిగతా 6,7,8 తరగతిలో మిగిలిన సీట్లకు ఈ నెల 9 వరకు కలెక్టరేట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News March 25, 2025
టేకుమట్ల: ఘోర రోడ్డు ప్రమాదం (UPDATE)

టేకుమట్ల మండలంలోని రామకృష్ణాపూర్(టి) సమీపంలో మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదంలో వరి పొలంలో పనికి సిద్ధమవుతున్న కూలీలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ క్రమంలో మోకిడి సంధ్య (30), పూలమ్మ (51) అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబంలో ప్రేమానురాగాలు పంచే తల్లులు మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వారి పిల్లల రోదనలు మిన్నంటాయి.
News March 25, 2025
BIG NEWS: ఏప్రిల్ 1 నుంచి ‘సదరమ్’ స్లాట్లు

AP: దివ్యాంగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సామాజిక పింఛన్ల తనిఖీ కోసం కొంతకాలంగా నిలిపివేసిన సదరమ్ స్లాట్లను ఏప్రిల్ 1 నుంచి పున:ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన ఏరియా, జిల్లా, టీచింగ్ ఆస్పత్రులు/GGHలలో ప్రతి మంగళవారం స్లాట్‌లు అందుబాటులో ఉంటాయని సెకండరీ హెల్త్ డైరెక్టర్ ఎ.సిరి తెలిపారు. పరీక్షల అనంతరం అర్హులకు సర్టిఫికెట్లు జారీ చేస్తామని పేర్కొన్నారు.
News March 25, 2025
భద్రాద్రి కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్న తండా వాసులు

దాసు తండా, రేగుల తండాలలో గత రెండేళ్లుగా అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వాహనాన్ని తండావాసులు మంగళవారం అడ్డుకున్నారు. టేకులపల్లి మండల పరిధిలో బోడు గ్రామంలో వివిధ పనులను పరిశీలించేందుకు బోడు వెళ్తున్న జిల్లా కలెక్టర్ వాహనాన్ని అడ్డుకొని రెండేళ్ల క్రితం ప్రారంభించిన పనులు మధ్యలోనే అసంపూర్తిగా వదిలేశారని వాపోయారు.