News September 7, 2025
VKB: అండర్-17 క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థులు

వికారాబాద్ జిల్లా ఎంకేపల్లిలోని మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల విద్యార్థులు ఇటీవల జరిగిన అండర్-17 క్రికెట్ పోటీలలో గెలుపొందారు. ఈ జట్టుకు మహనీత ప్రవికర్ నాయకత్వం వహించారు. పీఈటీ దోమ వెంకట పర్యవేక్షణలో శిక్షణ పొందిన విద్యార్థులు చక్కగా రాణించారని ప్రిన్సిపల్ శ్రీమతి సరళ రెడ్డి తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన వారిలో నేనావత్ మహనీత్, ప్రవికర్, వి.ధనుశ్ ఉన్నారు.
Similar News
News September 8, 2025
IASల బదిలీ.. TTD ఈవోగా సింఘాల్

ఏపీ ప్రభుత్వం 11 మంది IAS అధికారులను <
News September 8, 2025
‘ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో’ పోస్టర్ ఆవిష్కరణ

భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో-2025 పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ఈ ఎక్స్‌పో సెప్టెంబర్ 19 నుంచి 21 వరకు హైదరాబాద్‌లోని నార్సింగ్‌లోని ఓం కన్వెన్షన్ హాల్‌లో జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శనలో ఆధునిక కెమెరాలు, డ్రోన్లు, లెన్స్‌లు, ప్రింటింగ్ పరికరాలు, సాఫ్ట్‌వేర్లను ప్రదర్శిస్తామని వారు పేర్కొన్నారు. ఫొటోగ్రాఫర్లకు మంచి అవకాశమని ఎస్పీ అభిప్రాయపడ్డారు.
News September 8, 2025
రంప: ‘DRPలు తప్పనిసరిగా హాజరు కావాలి’

రంపచోడవరం, చింతూరు డివిజన్‌లో 11మండలాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ రేపటి నుంచి ప్రారంభమయ్యే శిక్షణ తప్పనిసరిగా హాజరు కావాలని ఏజెన్సీ DEO. మల్లేశ్వరావు సోమవారం మీడియాకు తెలిపారు. రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ నెల 9,10 తేదీల్లో వీరందరికి శిక్షణ ఉంటుందన్నారు. 11మండలాల్లో 44 మంది DRPలకు స్టేట్ రిసోర్స్ పర్సన్స్ టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ అనే అంశంపై శిక్షణ ఇస్తారని తెలిపారు.