News October 10, 2025

VKB: అడవి పందులను తప్పించబోయి.. వ్యక్తి దుర్మరణం

image

అడవి పందులను తప్పించే ప్రయత్నంలో బైక్ అదుపుతప్పి జుంటిపల్లికి చెందిన రాంచందర్(46) మృతి చెందారు. ఎస్సై విఠల్ రెడ్డి ప్రకారం.. రాంచందర్ తాండూరు నుంచి వస్తుండగా కోకట్ బైపాస్ వద్ద అడవి పందుల గుంపు అడ్డు వచ్చింది. వాటిని తప్పించే క్రమంలో బైక్ అదుపు తప్పి కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 10, 2025

యాదగిరిగుట్ట పాత గుట్టలో నిత్య కళ్యాణ మహోత్సవం

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ పూర్వ గిరి లక్ష్మీనరసింహస్వామి వారి పాత గుట్ట దేవాలయంలో శుక్రవారం స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవ సేవ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

News October 10, 2025

సంస్కరణలతో దేశ అభివృద్ధికి బలమైన బాట: బాపట్ల కలెక్టర్

image

GST 2025 సంస్కరణలు దేశ వ్యాప్తంగా వ్యాపారాల్లో, పరిశ్రమల్లో సూపర్ సేవింగ్స్‌తో వేగంగా, తక్కువ ఖర్చుతో పురోగమించేలా మారిపోయాయని కలెక్టర్ వినోద్ కుమార్ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ-కామర్స్‌, ఆటో మొబైల్‌ రంగాలు, అనుబంధ పరిశ్రమలకు సరళమైన GST నిబంధనలు, తక్కువ పన్ను శ్లాబులు వర్తించాయన్నారు. దీంతో అభివృద్ధి సులభతరం అవుతుందని పేర్కొన్నారు.

News October 10, 2025

సంగారెడ్డి: పది ప్రత్యేక తరగతులను పగడ్బందీగా నిర్వహించాలి: డీఈఓ

image

జిల్లాలలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్, కేజీబీవీ, ఎయిడెడ్, గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి ప్రత్యేక తరగతులను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని, ప్రతి వారం విద్యార్థులు లఘు పరీక్షలను నిర్వహించి వాటి ఫలితాలను రికార్డులో నమోదు చేయాలని సూచించారు.