News March 15, 2025
VKB: అలర్ట్.. పిల్లలపై కన్నేసి ఉంచండి

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా వేసవి తాపం నేపథ్యంలో నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు ఉంటాయి. ఒంటిపూట బడులు అంటే పిల్లలకు సరదా.. చెరువుల్లో, నీటి వనరుల వద్దకు వెళ్తుంటారు. చిన్నారులు నీట మునిగి మృత్యువాత పడిన ఘటనలు ఎన్నో జరిగాయి. చెరువులు, కుంటలు, బావులు నీటితో నిండి ఉన్నాయి. పిల్లల మీద పెద్దలు ఓ కన్నేసి ఉంచండి. SHARE IT..
Similar News
News March 16, 2025
మహిళా రక్షణ మా ప్రథమ కర్తవ్యం: ఎస్పీ

ప్రకాశం జిల్లాలోని మహిళలు, చిన్నారుల రక్షణకు శక్తి టీంలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ఆరు బృందాలుగా 36 మందితో శక్తి టీమ్స్ ఏర్పాటు చేసి జెండా ఊపి ప్రారంభించారు. మహిళల భద్రతకు పోలీస్ శాఖ రూపొందించిన “శక్తి” యాప్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శక్తి టీమ్స్ ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు.
News March 16, 2025
మధ్యాహ్నం వీటిని తింటున్నారా?

మధ్యాహ్న భోజనంలో కచ్చితంగా సలాడ్లు ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. అలాగే తెల్ల అన్నంకు బదులు క్వినోవా, బ్రౌన్ రైస్ లాంటి తృణధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. బాగా వేయించిన కర్రీలు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే బంగాళాదుంప, ప్రాసెస్డ్ ఫుడ్, మసాలా పదార్థాల జోలికి వెళ్లొద్దు.
News March 16, 2025
ధర్పల్లి: హోన్నాజీపేట్‌లో బీర్ సీసాతో కొట్టి చంపారు..!

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హోన్నాజిపేట్ గ్రామంలో పాలెం నడిపి మల్లయ్య (55) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడిని భార్య, కొడుకు కలిసి శనివారం రాత్రి చంపేశారని అనుమానిస్తున్నారు. మల్లయ్య తలపై కొడుకు మధు బీరు సీసాతో దాడి చేసి గొంతు నులిమి హత్య చేయగా అందుకు మల్లయ్య భార్య లక్ష్మి సహకరించినట్లు తెలిసింది. ఈ విషయం ఆదివారం ఉదయం వెలుగు చూసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.