News September 21, 2025
VKB: ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. అదుపులోకి పర్యాటకులు: సీఐ

వికారాబాద్‌లో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన నలుగురు పర్యాటకులని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతగిరి కొండ వద్ద ఈ ఘటన జరగ్గా, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వికారాబాద్ పట్టణ సీఐ భీమ్‌కుమార్ తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించామని, విచారణ కొనసాగుతోందని ఆయన చెప్పారు.
Similar News
News September 21, 2025
ఈ ఏడాది నవరాత్రుల ప్రత్యేకత ఏంటంటే?

ఈ ఏడాది చైత్ర నవరాత్రులు ఆదివారం ప్రారంభం కావడంతో దుర్గాదేవి శరన్నవరాత్రుల్లో భూమిపైకి ఏనుగు మీద వస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ ఆగమనం అత్యంత శుభప్రదమని అంటున్నారు. ‘అందువల్ల సకాలంలో వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండి, దేశం సుభిక్షంగా ఉంటుంది. దుర్గమ్మ తన భక్తులను కష్టాల నుంచి విముక్తి చేసి, సుఖసంతోషాలను ప్రసాదిస్తుంది. దీంతో మన జీవితాల్లో సానుకూల మార్పులు వస్తాయి’ అని సూచిస్తున్నారు.
News September 21, 2025
రేపటి ప్రజావాణి రద్దు: కలెక్టర్

సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. 23న సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటన ఉండటంతో అధికారులంతా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని, అందుకే కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. వచ్చే సోమవారం గ్రీవెన్స్ డే యథావిధిగా జరుగుతుందని వెల్లడించారు.
News September 21, 2025
NRPT: రేపటి ప్రజావాణి రద్దు: కలెక్టర్

నారాయణపేట కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు.
పరిపాలనకు సంబంధించి జిల్లా అధికారులతో సోమవారం ఉదయం 11.30 గంటలకు సమీక్షా సమావేశం ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. అర్జీలు ఇచ్చేందుకు ప్రజలు కలెక్టరేట్‌కు రావొద్దని చెప్పారు.