News October 13, 2025

VKB: ఇసుక మాఫియాకు రాజకీయ నేతల అండ?

image

వికారాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. ఈ దందాకు అంతా బడా నాయకుల అండ దండలతోనే సాగుతోందని విశ్వసనీయ సమాచారం. దీనిని అరికట్టేందుకు పోలీసులు, టాస్క్‌ఫోర్స్ బృందాలు ప్రయత్నిస్తే వాహనాలు వారిపైకి ఎక్కిచ్చేస్తున్నారు. తాజాగా తాండూర్‌లో ఓ ఘటన కలకలం రేపింది. వాహనాలు ఆపిన మరుక్షణమే ఓ బడా నాయకుడి నుంచి ఫోన్ వస్తుంది. వెంటనే విడిచిపెట్టకుంటే బెదిరింపులు పాల్పడుతున్నారనేది జిల్లాలో బహిరంగ రహస్యం.

Similar News

News October 13, 2025

ట్రంప్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారం

image

US అధ్యక్షుడు ట్రంప్‌కు ఇజ్రాయెల్ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. ఈ మేరకు ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ హానర్’ను ఇవ్వనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ వెల్లడించారు. యుద్ధాన్ని ముగించడంలో సాయం చేసినందుకు, బందీల విడుదలకు చేసిన కృషికి ఈ అవార్డును అందజేయనున్నట్లు తెలిపారు. సెక్యూరిటీ, సహకారం, శాంతియుత భవిష్యత్తు కోసం మిడిల్ ఈస్ట్‌లో ఆయన కొత్త శకానికి నాంది పలికారని కొనియాడారు.

News October 13, 2025

యాదాద్రి: భారీ వర్షం.. తడిసిన ధాన్యం

image

జిల్లా కేంద్రంలో గత కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్న తరుణంలో, సోమవారం తెల్లవారుజామున ఊహించని విధంగా భారీ వర్షం దంచికొట్టింది. దీంతో ఐకేపీ కొనుగోలు కేంద్రాలలో ఆరబోసిన వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది. వరికోతలు ముమ్మరంగా సాగుతున్న వేళ, ధాన్యాన్ని మార్కెట్‌కు చేర్చి ఆముదం అనుకుంటున్న సమయంలో వర్షం రావడంతో రైతులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

News October 13, 2025

కరీంనగర్: ప్రకృతి సంపదను ‘తోడేస్తున్నారు’..!

image

ఉమ్మడి KNRలో గోదావరి, మానేరు నదులను ఇసుక మాఫియా తోడేస్తోంది. అధికార పార్టీ నేతల అండదండలతోనే ఇసుక అక్రమ రవాణా సాగుతుందన్న టాక్ నడుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా రీచుల్లో రాత్రింబవళ్లు తేడా లేకుండా ఇసుకను తోడేసి తరలిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన మైనింగ్ శాఖ, TGMDC చూసీచూడనట్లు వ్యవహరించడంపై విమర్శలొస్తున్నాయి. KNR, RGM CPలు ఇసుకాసురలకు చెక్ పెట్టి ప్రకృతి సంపదను కాపాడాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.