News October 27, 2025

VKB: ‘ఉద్యానవన పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలి’

image

ఉద్యానవన పంటల సాగుకు రైతులను ప్రోత్సహించి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటున అందించాలని అదనపు కలెక్టర్ సుధీర్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో ఉద్యానవన పంటలు ఆయిల్ పామ్ పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఉద్యానవన పంటల సాగులో లక్ష్యాలను అధిగమించేలా రైతులను ప్రోత్సహించి రైతుల ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

Similar News

News October 27, 2025

సంగారెడ్డి: ‘ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి’

image

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే పూర్తిస్థాయిలో ప్రారంభించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సివిల్ సప్లై అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. దీంతో పాటు సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలను కూడా వెంటనే ప్రారంభించాలని సూచించారు.

News October 27, 2025

NRPT: అకాల వర్షాలతో పంట నష్టం జరగకుండా చూడాలి

image

అకాల వర్షాలతో రైతుల పంటలు నష్టం వాటిల్లకుండా చూడాలని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు కలెక్టర్లను ఆదేశించారు. హైద్రాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పత్తి, వరి కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News October 27, 2025

కవిత కొత్తగా..

image

TG: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త వేషధారణలో కనిపిస్తున్నారు. జనం బాట కార్యక్రమం చేపట్టిన ఆమె గతంతో పోలిస్తే సాదాసీదా చీరలు ధరిస్తున్నారు. హెయిర్ స్టైల్ కూడా కొత్తగా ఉంది. ప్రస్తుతం కవిత నిజామాబాద్ జిల్లాలో రైతులను పరామర్శిస్తున్నారు. 4 నెలల పాటు ఈ యాత్ర సాగనుంది.