News November 13, 2025

VKB: ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోండి!

image

వికారాబాద్‌ జిల్లాలోని అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులకు శుభవార్త. 2025-26 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాలు (స్కాలర్‌షిప్‌లు) పొందడానికి వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి మాధవరెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 13, 2025

అమలాపురం: వ్యభిచార గృహంపై దాడి

image

అమలాపురంలో పట్టాభి స్ట్రీట్‌లో ఓఇంట్లో వ్యభిచారం సాగుతోందని పోలీసులు గుర్తించారు. కొంతమంది అండతో పాయసం వెంకట రమణ ఇద్దరు అమ్మాయిలతో ఈ వ్యాపారం నిర్వహిస్తోందని సమాచారంతో సీఐ వీరబాబు బుధవారం రాత్రి దాడి చేశారు. ఇద్దరు అమ్మాయిలతో పాటు నలుగురు విటులు అదుపులోకి తీసుకోగా, 2 వేల నగదు, 5 కండోమ్‌లను స్వాధీనం చేసుకున్నారు. అయిదుగురిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు టౌన్ సీఐ వీరబాబు గురువారం తెలిపారు.

News November 13, 2025

జూబ్లీహిల్స్: రేపు వైన్స్ బంద్

image

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో రేపు ఉదయం నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు బంద్ ఉంటాయని అధికారులు మరోసారి గుర్తు చేశారు. వైన్స్, బార్‌లు, కల్లు కంపౌండ్‌లు మూసివేయాలని ఆదేశించారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియ ఉన్నందున పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. కౌంటింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం వైన్స్ తెరుచుకోనున్నాయి. SHARE IT

News November 13, 2025

వరంగల్ బస్టాండ్ వద్ద బీజేపీ వినూత్న నిరసన

image

వరంగల్ కొత్త బస్టాండ్ నిర్మాణ పనులు నిలిచిపోయిన నేపథ్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆధ్వర్యంలో గురువారం వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. ‘వరంగల్ బస్టాండ్‌లో పడవ ప్రయాణం- కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులకు ఉచితం’ అనే శీర్షికతో చేపట్టిన ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న బస్టాండ్ వద్ద జరగనుంది. మీడియా మిత్రులను పాల్గొనాలని ఆహ్వానించారు.