News March 14, 2025
VKB: ఎండిపోతున్న పెద్ద చెరువు.. ఆందోళనలో రైతన్నలు

పెద్దేముల్ మండలంలోని కొండాపూర్ పెద్ద చెరువు ఎండుముఖం పట్టింది. చెరువు ఆయకట్టు కింద సుమారు 90 ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తున్నారు. చెరువు ఎండిపోతుండటంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. కాలువలకు గండ్లు పడటంతో నీరు వృథాగా పోతోంది. ఫలితంగా రైతుల పంట పొలాలు ఎండిపోయే ప్రమాదం పొంచి ఉందని వాపోతున్నారు. చెరువు నీరు వృథా పోకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటే మేలవుతుందని రైతులు పేర్కొంటున్నారు.
Similar News
News March 14, 2025
KMR: హోలీ పండుగ ఈ ప్రాంతాల్లో ప్రత్యేక ఇదే..!

హోలీ అంటేనే రంగులు.. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంతో పాటు జిల్లా సరిహద్దైనా కంగ్టి ప్రాంతాల్లో రంగుల పండుగతో పాటు ఒక ప్రత్యేక సంప్రదాయానికి విశేష ప్రాధాన్యం ఉంది. మేన మమాలు తమ మేనల్లులకు, మేన కోడళ్లకు కుడక ఖర్జూర, బత్తిస హారాలు (చక్కెరతో చేసినవి) బహుమతిగా అందించడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. మరి మీ ప్రాంతాల్లో ఈ అనవాయితీ ఉందా.. కామెంట్‌లో తెలపండి.
News March 14, 2025
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ వదిలేస్తున్నారా? బచ్చన్ ఏమన్నారంటే..

టీవీ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ని అమితాబ్ బచ్చన్ వదిలేస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం నడుస్తోంది. దానిపై 16వ సీజన్ చివరి ఎపిసోడ్‌లో బచ్చన్ క్లారిటీ ఇచ్చేశారు. ‘హోస్ట్‌గా ఆడియన్స్ నుంచి నాకు చాలా మద్దతు లభించింది. వచ్చే సీజన్‌లో మిమ్మల్ని మళ్లీ కలుస్తాను. మీ కష్టాన్ని నమ్ముకోండి. కలల్ని సజీవంగా ఉంచుకోండి’ అని ముగించారు. మళ్లీ బచ్చనే ఉంటారని తెలియడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.
News March 14, 2025
పార్వతీపురం జిల్లాలో రేపు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర

జిల్లా వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర – స్వచ్ఛ సుందర పార్వతీపురం కార్యక్రమంపై సంబంధ అధికారులతో జిల్లా కలెక్టర్ శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ సుందర పార్వతీపురం కార్యక్రమంలో ప్రజలు భాగం కావాలని పిలుపునిచ్చారు.