News September 10, 2025

VKB: ఐలమ్మ పోరాటపటిమను ఆదర్శంగా తీసుకోవాలి: అ.కలెక్టర్

image

భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పెత్తందారులకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడిన చాకలి ఐలమ్మ పోరాటపటిమను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు.

Similar News

News September 10, 2025

తూప్రాన్: ఆస్పత్రిని సందర్శించిన కలెక్టర్

image

తూప్రాన్ పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం సందర్శించారు. మనోహరాబాద్ మండల పర్యటనకు విచ్చేసిన కలెక్టర్ ఆసుపత్రిని సందర్శించి, రోగులను పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. రక్త పరీక్షలను పూర్తిస్థాయిలో నిర్వహించాలని సూపరింటెండెంట్ అమర్ సింగ్‌కు సూచించారు.

News September 10, 2025

మెదక్: అగ్రిసెట్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్

image

ప్రొపెసర్ జయశంకర్ అగ్రికల్చర్ విశ్య విద్యాలయం నిర్వహించిన 2025-26 అగ్రిసెట్ ఫలితాలలో పెద్ద శంకరంపేటకు చెందిన ప్రజ్ఞ శ్రీ రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకు సాధించింది. మంగళవారం బీఎస్సీ అగ్రికల్చర్ ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయగా రాష్ట్రస్థాయి మొదటి ర్యాంక్ వచ్చిందని ప్రజ్ఞ పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే ఈ ర్యాంకు సాధించినట్లు ఆనందం వ్యక్తం చేసింది.

News September 10, 2025

‘సూపర్-6, సూపర్ హిట్’ సభ హైలైట్స్

image

★ దసరా రోజు ఆటో డ్రైవర్లకు రూ.15వేలు
★ వచ్చే ఎన్నికల్లో సీమలో 52 సీట్లు గెలుస్తాం: సీఎం
★ అనంతపురం అభివృద్ధికి బ్లూ ప్రింట్
★ రాయలసీమలో శాశ్వతంగా కరవు నివారణ
★ రప్పా రప్పా అంటే చూస్తూ ఊరుకోం: చంద్రబాబు
★ ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్-6 అమలు: డిప్యూటీ సీఎం
★ 7 నిమిషాల్లోనే ప్రసంగం ముగించిన పవన్ కళ్యాణ్
★ సూపర్ హిట్ <<17669002>>జెండాలతో<<>>.. చంద్రబాబు-పవన్-మాధవ్ అభివాదం
★ లోకేశ్, బాలకృష్ణ సభకు <<17668689>>దూరం<<>>