News September 6, 2025
VKB: ‘కాంగ్రెస్‌పై ప్రేమ ఉంటే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలి’

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉపాధ్యాయులను కోరడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్యే డా.మెతుకు ఆనంద్ విమర్శించారు. కాంగ్రెస్‌పై ప్రేమ ఉంటే స్పీకర్ పదవికి రాజీనామా చేసి రాజకీయాలు చేసుకోవాలని ఆయన హితవు పలికారు. స్పీకర్ పదవిలో ఉండి ఇలా మాట్లాడటం ఆ పదవికే మచ్చ తెస్తుందని అన్నారు. విద్యా ప్రమాణాలు మెరుగుపరచమని కోరాల్సింది పోయి రాజకీయాలు మాట్లాడడం సరికాదన్నారు.
Similar News
News September 7, 2025
విశాఖ: కొనసాగుతున్న సహాయక చర్యలు

ఈస్ట్ ఇండియా పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో పిడుగు పడిన విషయం తెలిసిందే. ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద పార్కింగ్ సమీపంలో ఉన్న ఇందనాల్ ట్యాంకర్ పై పిడుగు పడటంతో భారీగా మంటలు చెలరేగాయి. సంస్థలో మిగతా ట్యాంకులకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. మల్కాపురం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
News September 7, 2025
పండగ రద్దీ తగ్గించేందుకు ఇతర స్టేషన్లకు రైళ్ల మళ్లింపు

దసరా, దీపావళి పండగల కోసం సొంతూరికి వెళ్లేందుకు ప్రయాణికులు సెప్టెంబర్ నుంచే సికింద్రాబాద్ స్టేషన్‌కు క్యూ కడతారు. అధిక రద్దీ కారణంగా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా కొన్ని రైళ్లను ఇతర స్టేషన్లకు మళ్లించనున్నారు. సనత్‌నగర్, చర్లపల్లి, అమ్ముగూడ, మౌలాలి స్టేషన్లకు మళ్లించాలని నిర్ణయించారు. పండగ రద్దీ కారణంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సిటీ పోలీస్, ఆర్టీసీ సిబ్బంది సేవలను ఉపయోగించుకోనున్నారు.
News September 7, 2025
గద్వాల: కృష్ణా నదిలో బాలుడి గాలింపు

గద్వాల(M) రేకులపల్లి వద్ద కృష్ణా నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారుల్లో ఒకరు గల్లంతయ్యారు. మరొకరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. చంద్రశేఖర్(13), అతని స్నేహితుడు కృష్ణతో కలిసి చేపలు పట్టేందుకు నదిలోకి వెళ్లారు. రాత్రి కావడంతో వారు పుట్టిలో నిద్రిస్తుండగా, నదిలో ప్రవాహం పెరిగి పుట్టి కొట్టుకుపోయింది. కృష్ణకు ఈత రావడంతో సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాడు. చంద్రశేఖర్ కోసం గాలిస్తున్నారు.