News October 23, 2025
VKB-కొడంగల్ రైల్వే లైన్‌కు రూ. 437 కోట్లు మంజూరు

వికారాబాద్ నుంచి కొడంగల్ మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పనుల కోసం ప్రభుత్వం రూ. 437 కోట్లు ఖర్చు చేయనుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొడంగల్ ప్రజల చిరకాల కల ఈ ప్రాజెక్టుతో నెరవేరనుంది. రైల్వే మార్గం ఏర్పాటుకు తొలి అడుగు విజయవంతంగా పడగా, దీనికోసం 845 హెక్టార్ల భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలోనే కొడంగల్ మీదుగా రైలు కూత వినిపించనుంది.
Similar News
News October 23, 2025
కృష్ణా: భారీ వర్షాలు.. విద్యుత్ అధికారుల హెచ్చరిక

భారీ వర్షాలు, గాలుల నేపథ్యంలో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండటంతో జిల్లా విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తడిచిన విద్యుత్ స్తంభాలను, లైన్‌కు తగిలిన చెట్లను ముట్టుకోవద్దని చెప్పారు. విద్యుత్ లైన్ దెబ్బతిన్నట్లు గమనిస్తే వెంటనే సిబ్బంది, లేదా 1912 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.
News October 23, 2025
మేడ్చల్-మల్కాజిగిరిలో 5 వేలకు చేరువలో వైన్స్ టెండర్లు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 88 మద్యం దుకాణాలకు మొత్తం 4,910 దరఖాస్తులు అందినట్లు DPEO నవీన్ తెలిపారు. దరఖాస్తుల గడువును ఎక్సైజ్ శాఖ 18 నుంచి 23వ తేదీ వరకు పొడిగించిన తర్వాత కేవలం 30 దరఖాస్తులు మాత్రమే అందినట్లు తెలిపారు. ఈరోజు చివరి రోజు కావడంతో మరికొన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. సా.5 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనున్నట్లు తెలిపారు. ఈనెల 27వ తేదీన డ్రా నిర్వహించనున్నారు.
News October 23, 2025
NOV 1 నుంచి ప్రాంతీయ అభివృద్ధి అధికారుల కార్యాలయాలు: పవన్

AP: పంచాయతీల పాలనా సంస్కరణల ఫలితాలు ప్రజలకు అందించాలని Dy.CM పవన్ అధికారులను ఆదేశించారు. ‘నవంబర్ 1 నుంచి ప్రాంతీయ అభివృద్ధి అధికారుల కార్యాలయాలు ప్రారంభించాలి. పంచాయతీలు ఆర్థిక స్వయం ప్రతిపత్తి సాధించేలా సరికొత్త ప్రణాళికలు రూపొందించాలి. పాలనా సంస్కరణల అమలుపై ఎప్పటికప్పుడు సమీక్షించాలి. పల్లె పండుగ 2.0తో గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి ప్రణాళిక ఇవ్వాలి’ అని ఆదేశించారు.