News October 17, 2025
VKB: ఖాళీగా ఉన్న సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం

వికారాబాద్ జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో 5 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. దరఖాస్తులు సమర్పించేందుకు 18న చివరి తేదీ సాయంత్రం 5 గంటల లోపు కొత్తగడిలోని బాలికల పాఠశాలలో ఇవ్వాలన్నారు. దరఖాస్తులతో పాటు కులం, ఆదాయం, హాల్ టికెట్, ర్యాంక్ కార్డు సమర్పించాలన్నారు.
Similar News
News October 18, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 18, శనివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.57 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.10 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.15 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.52 గంటలకు
✒ ఇష: రాత్రి 7.05 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 18, 2025
HYD: నిజాంపేటలో చిట్టీల పేరుతో రూ.150 కోట్లు స్వాహా

చిట్టీల పేరుతో డబ్బులు స్వాహా చేసిన ఘటన HYD నిజాంపేట పరిధిలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. నిజాంపేటలో రేష్మ, అలీ అనే దంపతులు క్లినిక్ నడుపుతున్నారు. దీంతో పాటు చిట్టీలు నిర్వహించేవారు. అయితే సుమారు 100 మంది నుంచి రూ.150 కోట్ల వరకు వసూలు చేసిన రేష్మ దంపతులు పరారయ్యారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు PSను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.