News March 28, 2025

VKB: గ్రేట్.. ఆర్మీకి సెలెక్ట్ 

image

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని ఇప్పాయిపల్లికి చెందిన జంగం యాదయ్య కుమారుడు జంగం గణేష్, మెరుగు శ్రీశైలం కుమారుడు మెరుగు అఖిల్, ఎల్లయ్య కుమారుడు పినేమోని అభిలాశ్ ఆర్మీలో ఉద్యోగాలు సాధించారు. వారివి పేద కుటుంబాలు కాగా పేరెంట్స్ పని చేస్తే కానీ పూట గడవని పరిస్థితి. ఆ కష్టాలు చూస్తూ పెరిగిన ముగ్గురు యువకులు సత్తా చాటారు. అగ్నీవీరులుగా ఎంపికయ్యారు. 

Similar News

News March 31, 2025

నిర్మల్ అదనపు కలెక్టర్ సతీమణికి గ్రూప్-1లో స్టేట్ ర్యాంక్

image

గ్రూప్-1 ర్యాంకుల ఫలితాల్లో నిర్మల్ అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సతీమణి ప్రతిభ కనబరిచారు. టీజీపీఎస్సీ ఆదివారం విడుదల చేసిన గ్రూప్-1 పరీక్ష జనరల్ ర్యాంకింగ్‌లో అదనపు కలెక్టర్ సతీమణి బరిరా ఫరీద్ రాష్ట్రస్థాయిలో 68వ ర్యాంకు (బీసీఈ కేటగిరీలో మొదటి ర్యాంకు) సాధించారు. కాగా ఆమె ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ఆఫ్ ఫార్మసీ డిగ్రీని పూర్తి చేశారు.

News March 31, 2025

మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం

image

మానసిక దివ్యాంగురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేట మండలంలో జరిగింది. ఎస్ఐ యయాతి రాజు వివరాలు.. ఆసుపాకకు చెందిన దివ్యాంగురాలు తన తల్లితో పాటు కలిసి ఉంటుంది. శనివారం తల్లి బయటకు వెళ్లడంతో ఒంటరిగా ఉన్న దివ్యాంగురాలిపై అదే గ్రామానికి చెందిన వెంకటేశ్ అమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టు పక్కలవారు రావడంతో వెంకటేశ్ పరారయ్యాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

News March 31, 2025

తిరుపతి: శ్రీవారి భక్తుడు మృతి

image

ఈనెల 24న భూదేవి కాంప్లెక్స్‌లోని టాయిలెట్‌లో కాలు జారిపడిన శ్రీవారి భక్తుడిని అధికారులు రూయ ఆసుపత్రిలో చేర్పించారు. రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ భక్తుడు ఆదివారం మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి ఒంగోలుకు చెందిన వీరాంజనేయులుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు అలిపిరి ఎస్సై అజిత కేసు నమోదు చేశారు.

error: Content is protected !!