News April 5, 2025
VKB: జిల్లాలో నేటి..TOP NEWS!!

✔ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ✔Weather Alert: పెరగనున్న ఎండలు ✔IPL బెట్టింగ్.. జోలికి వెళ్ళకండి:ఎస్సైలు ✔VKB: పద్మనాభ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం ✔జిల్లా సహకార శాఖ అధికారిగా నాగార్జున ✔‘కేంద్ర పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం’:BJP ✔VKB:19 ప్రభుత్వ పాఠశాలల్లో AI తరగతులు ✔జిల్లాలో తగ్గిపోతున్న మామిడి పంట ✔పలుచోట్ల సన్న బియ్యం పంపిణీ
Similar News
News April 6, 2025
అమరావతి: వేగంగా గ్లోబల్ మెడ్‌టెక్ ఇన్‌స్టిట్యూట్ నిర్మాణ పనులు

ఏపీ మెడ్‌టెక్‌జోన్ ప్రాంగణంలో గ్లోబల్ మెడ్‌టెక్ ఇన్‌స్టిట్యూట్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇది మరో ప్రతిష్ఠాత్మక నిర్మాణంగా నిలుస్తోంది. పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయిన తర్వాత ఇది రాష్ట్రానికి, దేశానికి సాంకేతిక వైద్య పరికరాల రంగంలో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. ఈ నిర్మాణం పూర్తయితే ఎలా ఉంటుందో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
News April 6, 2025
కృష్ణా: నదిలో ముగ్గురు గల్లంతు, ఒకరి మృతి

అవనిగడ్డలో పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది. ఆదివారం అవనిగడ్డ (మ) మోదుమూడి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు అవనిగడ్డ శివారు కొత్తపేట వద్ద కృష్ణానదిలో ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. స్థానికులు గమనించి సహాయక చర్యలు చేపట్టే లోపే ముగ్గురిలో వెంకట గోపి కిరణ్ మరణించాడు. మరో ఇద్దరి కోసం డీఎస్పీ విద్యశ్రీ, సీఐ యువ కుమార్, ఎస్ఐ శ్రీనివాస్, సిబ్బంది గాలిస్తున్నారు.
News April 6, 2025
భద్రకాళి అమ్మవారికి లిల్లీ పూలతో లక్ష పుష్పార్చన

వరంగల్ భద్రకాళి దేవస్థానంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఆలయ అర్చకులు అమ్మవారికి లిల్లీ పూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులున్నారు.