News April 11, 2025
VKB: జిల్లాలో నేటి..TOP NEWS!!

✔పలుచోట్ల ఈదురుగాలులతో వర్ష బీభత్సం ✔రేపు పూలే జయంతి వేడుకలు ✔KCR సభకు.. పార్టీ శ్రేణులకు పిలుపు:BRS ✔జిల్లాల్లో జోరుగా వరి కోతలు ✔IPL బెట్టింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు:ఎస్సైలు ✔పలుచోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం ✔VKB: కలెక్టరేట్‌లో షార్ట్ సర్క్యూట్ ✔తహశీల్దార్ల అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కిషన్ నాయక్ ✔VKB: ఓపెన్ స్కూల్ హాల్ టికెట్లు విడుదల
Similar News
News July 6, 2025
వరల్డ్ అథ్లెటిక్స్ నిర్వహణ కోసం పోటీలో భారత్

వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌ను నిర్వహించడం కోసం భారత్ బిడ్లు దాఖలు చేయనుంది. 2029, 2031 ఎడిషన్ల కోసం బిడ్లు వేయనున్నట్లు నేషనల్ ఫెడరేషన్ స్పోక్స్ పర్సన్ ఆదిల్ సుమారివాలా వెల్లడించారు. ఏదైనా ఒక ఎడిషన్‌ను నిర్వహించే అవకాశం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తామన్నారు. బిడ్ల దాఖలుకు గడువు ఈ ఏడాది OCT1తో ముగియనుంది. హోస్ట్‌ల వివరాలను వరల్డ్ అథ్లెటిక్స్ వచ్చే ఏడాది SEPలో ప్రకటిస్తుంది.
News July 6, 2025
నిజామాబాద్‌లో సందడి చేసిన నటి అనసూయ

నిజామాబాద్ నగరంలో నటి అనసూయ ఆదివారం సందడి చేసింది. హైదరాబాద్ రోడ్డులోని ఓ షాప్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. పలు పాటలకు స్టెప్పులు వేసి ఉర్రూతలూగించారు. ఆమె మాట్లాడుతూ.. నిజామాబాద్‌కు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇందూరులో తనకు ఇంత మంది అభిమానులు ఉండటం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు.
News July 6, 2025
శ్రీకాకుళం: మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనాలు పెంచాలి

మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వేతనాలు పెంచి వారి సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీకాకుళంలోని సీఐటీయూ కార్యాలయంలో ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల, స్కూల్ స్వీపర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. మెనూ ఛార్జీలు ఒక్కొక్క విద్యార్థికి కనీసం రూ.20/-లు ఇవ్వాలని కోరారు. గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు.