News April 5, 2025
VKB: జిల్లాలో నేటి..TOP NEWS

✓వికారాబాద్ జిల్లా సీపీఓగా జి.వెంకటేశ్వర్లు ✓ పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ ✓ పలుచోట్ల సన్న బియ్యం పంపిణీ ✓ గండీడ్:GOVT ఉద్యోగాలు సాధించిన వారికి ఘన సన్మానం ✓ IPL బెట్టింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్సైలు ✓ VKB: మాజీ సీఎంKCRతో బీఆర్ఎస్ నాయకుల సమావేశం ✓VKB: CM రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం ✓ VKB:సన్న బియ్యం సరఫరా పారదర్శకంగా జరగాలి: కలెక్టర్
Similar News
News April 12, 2025
ఒంటిమిట్టలో వైభవంగా శ్రీరాముడి రథోత్సవం

ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండ రాముడు రథాన్ని అధిష్టించి మాడ వీధుల్లో విహరించారు. భజన బృందాలు, చెక్కభజనలు, కోలాటాలు చేస్తుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
News April 12, 2025
విద్యా, వైద్యం బలోపేతంపై కృషి: MLA పద్మావతి

కోదాడ నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని స్థానిక ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం మునగాలలో రూ.1.56కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. పేదలకు నాణ్యమైన వైద్యం, విద్య అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా.కోటచలం, మాజీ ఎంపీపీ ఎలక బిందు, స్థానిక నాయకులు ఉన్నారు.
News April 12, 2025
ఈ నెల 14న అంబేద్కర్ జయంతి వేడుకలు

భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డా. బి.ఆర్.అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఈ నెల 14న అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించనున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి సునీత తెలిపారు. ఈ ఉత్సవాలకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల వెనుకబడిన తరగతుల నాయకులు, కార్మికులు హాజరుకావాలని ఆమె కోరారు.