News November 28, 2025
VKB: టీఈ పోల్ యాప్‌ను వినియోగించుకోండి: కలెక్టర్

టీఈ పోల్ మొబైల్ యాప్ ద్వారా కావాలసిన సమాచారాన్ని పొందవచ్చునని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు వివరాలను మొబైల్ యాప్ ద్వారా ఓటర్ స్లిప్ ను పొందవచ్చునని తెలిపారు. పోలింగ్ స్టేషన్ల వివరాలను కూడా యాప్ ద్వారా తెలుసుకోవచ్చునని, అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదును కూడా యాప్ ద్వారా తెలియచేయవచ్చునని తెలిపారు.
Similar News
News December 1, 2025
MDK: కొత్త వైన్ షాపులకు ఎలక్షన్ ‘కిక్కు’

2025-27 సంవత్సరానికి లక్కీడిప్ ద్వారా మద్యం షాపులు దక్కించుకున్న వారు ఈరోజు ఓపెన్ చేశారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు ఉండడంతో షాప్‌లు దక్కించుకున్న వారికి ప్రారంభంలోనే లాభాల కిక్కు కలిసిరానున్నది. ఉమ్మడి జిల్లాలో మెజార్టీ వైన్స్‌లు లిక్కర్ సిండికేట్ల చేతికి చేరాయి. ఎన్నికలు కలిసి రావడంతో మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు జోష్‌లో ఉన్నారు. సంగారెడ్డిలో 101, మెదక్ 43, సిద్దిపేటలో 93 షాపులున్నాయి.
News December 1, 2025
GNT: ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా.!

ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీలు నేడు రాజీనామా చేయటం సంచలనంగా మారింది. వారు కొద్దిసేపటి క్రితం శాసనమండలి ఛైర్మన్‌ను కలిసి తమ రాజీనామాలు సమర్పించారు. రాజీనామా నేపథ్యంలో వివరణ ఇచ్చిన ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, కల్యాణ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణ, జాకియా ఖానం, పోతుల సునీతలు తమ రాజీనామాలను వెంటనే ఆమోదించాలని ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు.
News December 1, 2025
HYD: ఓన్లీ ప్రాఫిట్ నో లాస్ పేరుతో రూ.1.87కోట్ల మోసం

స్టాక్ సలహాల పేరుతో నగరానికి చెందిన కృత్రిమ ఆభరణాల వ్యాపారిని మోసగించిన ఇండోర్‌కు చెందిన ముఖేశ్ పాఠక్‌పై సీసీఎస్ కేసు నమోదు చేసింది. ‘ఓన్లీ ప్రాఫిట్ నో లాస్’ అని నమ్మబలికి 2021 నుంచి 2024 వరకు దశలవారీగా రూ.1.87కోట్లు తీసుకున్న నిందితుడు. చివరికి ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సీసీఎస్ తెలిపింది.


