News December 2, 2025
VKB: డీసీసీ అధ్యక్ష నియామక పత్రాన్ని అందుకున్న ధారాసింగ్

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా విధులు నిర్వహించి, పార్టీ పటిష్టతకు కృషి చేయాలని ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియామకమైన ధారా సింగ్‌కు ఆమె నియామక పత్రాన్ని అందజేశారు. జిల్లాలోని నాయకులను, కార్యకర్తలను కలుపుకుని పార్టీని తిరుగులేని శక్తిగా ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు.
Similar News
News December 5, 2025
మేడారంలో గోవిందరాజు గద్దెను కదిలించిన పూజారులు

మేడారంలో గురువారం గోవిందరాజు గద్దెను పూజారులు కదిలించారు. ఏటూరునాగారం మండలం కొండాయిలోని గోవిందరాజు పూజారులు మేడారానికి చేరుకొని సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పూజారులతో కలిసి గోవిందరాజు పాత గద్దె వద్ద ప్రత్యేక పూజలు చేసి, ఐదుగురు పూజారులతో కలిసి గద్దెను కదిలించారు.
News December 5, 2025
నేడు నర్సంపేటకు సీఎం.. షెడ్యూల్ ఇదే..!

నేడు నర్సంపేటకు సీఎం రేవంత్ రానున్న విషయం తెలిసిందే. నియోజకవర్గంలో రూ.531 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మెడికల్ కళాశాల సమీపంలో శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 1:15 గం.కు బేగంపేట నుంచి హెలీకాప్టర్‌లో బయల్దేరి, 2 గంటలకు నర్సంపేట హెలీప్యాడ్ చేరుకుంటారు. మ.2:15 నుంచి 3:55 వరకు కార్యక్రమాల్లో పాల్గొని, 4 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు.
News December 5, 2025
ప.గోలో 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరందించేలా ప్రాజెక్ట్

జిల్లాలో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రూ.1,400 కోట్లతో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం తెలిపారు. 16 మండలాల పరిధిలోని 862 గ్రామాల్లోని 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. దీని కోసం 2,662 కిలోమీటర్ల మేర పైపులైన్ వేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.


