News April 19, 2025
VKB: దొంగల బెడదకు కాలనీవాసుల గస్తీ

వికారాబాద్ పట్టణంలోని మణికంఠ నగర్ కాలనీలో దొంగల బెడదకు కాలనీవాసులు రాత్రిపూట గస్తీ నిర్వహిస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం కాలనీలో రెండు వరస దొంగతనాలు జరిగిన నేపథ్యంలో కాలనీ వాసుల్లో దొంగల భయం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రతిరోజు రాత్రిపూట భారీ కర్రలతో, రాడ్లతో, పైపులతో కాలనీవాసులు గస్తీ నిర్వహిస్తున్నారు.
Similar News
News April 19, 2025
అలంపూర్ ఆలయ అభివృద్ధికి హై లెవెల్ కమిటీ పరిశీలన

అలంపూర్ ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం హై లెవెల్ కమిటీ చేపడుతున్న పలు అభివృద్ధి పనులలో భాగంగా శనివారం ఆలయ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. సభ్యులైన దేవాదాయ శాఖ స్థపతి వల్లినాయగం, సభ్యులు & దేవాదాయ శాఖ ధార్మిక అడ్వైజర్ గోవింద హరి, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి, శృంగేరి పీఠాధిపతుల వారి శిష్య బృందం ఆలయాన్ని సందర్శించింది. అనంతరం అభివృద్ధి గురించి చర్చించారు.
News April 19, 2025
ఆ 27మందిపై అనర్హత వేటు వేయండి: వైసీపీ

జీవీఎంసీ ఇన్‌ఛార్జ్ కమిషనర్ హరేంద్ర ప్రసాద్‌ను వైసీపీ నేత తైనాల విజయ్ కుమార్ కలిశారు. విప్ ధిక్కరించిన 27 మంది కార్పొరేటర్లపై ఫిర్యాదు చేశారు. జీవీఎంసీ కాన్ఫిడెన్స్ ఇన్ మేయర్ రూల్స్-2008 ప్రకారం వైసీపీ గుర్తుపై గెలిచి కూటమికి మద్దతు ఇవ్వడం ప్రొసీడింగ్స్ ప్రకారం తప్పని.. 27మంది కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని కోరారు. విప్ కాపీని అందజేశారు.
News April 19, 2025
ఈ అలవాట్లతో మీ లివర్ రిస్క్‌లో పడ్డట్లే..

చక్కెర అధికంగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల అది కొవ్వుగా మారి ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రై ఫుడ్స్ కాలేయంపై భారాన్ని పెంచుతాయి. మాంసం అధికంగా తినడం వల్ల శరీరంలో అమ్మోనియా స్థాయులు పెరుగుతాయి. పెయిన్ కిల్లర్స్, వెయిట్ లాస్ మెడిసిన్స్ వల్ల కాలేయంపై ప్రభావం పడే అవకాశముంది. లివర్ చెడిపోవడానికి ఆల్కహాల్ ప్రధాన కారణమని, కనుక ఈ అలవాటును పూర్తిగా మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.