News November 10, 2025

VKB: ధాన్యం సరైన విధంగా కొనుగోలు చేయాలి: కలెక్టర్

image

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం పత్తి కొనుగోలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరి ధాన్యం పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అసౌకర్యం కలగకుండా సౌకర్యాలు కల్పించి కొనుగోలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.

Similar News

News November 11, 2025

SRCL: చిన్న నీటి పారుదల వవరులపై సమీక్ష సమావేశం

image

చిన్న నీటి పారుదల వనరుల సర్వే పకడ్బందీగా చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. చిన్న నీటి పారుదల వనరుల సర్వేపై డీఆర్డీఓ, వ్యవసాయ, ఈఈ పీఆర్, నీటి పారుదల శాఖ, సెస్, సీపీఓ తదితర శాఖల డిస్ట్రిక్ట్ లెవెల్ స్టీరింగ్ కమిటీ అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడారు.

News November 11, 2025

HYD: అనుమానాస్పద స్థితిలో యువకుడి ఆత్మహత్య

image

రాజేంద్రనగర్‌ హనుమాన్‌నగర్‌ ప్రాంతానికి ధనుష్‌ కుమార్‌(22) హౌస్‌ కీపింగ్‌ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఆదివారం ఆస్పత్రికి వెళ్లి వస్తానని తన ద్విచక్ర వాహనాన్ని తీసుకొని బయటికి వెళ్లాడు. కుమారుడు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రితోపాటు చుట్టు పక్కల వెతికారు. సోమవారం వాలంతరి ఏపీఈఆర్‌ఎల్‌ వెనుక చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 11, 2025

జంక్ ఫుడ్ తింటున్నారా?

image

అల్ట్రా-ప్రాసెస్డ్ జంక్ ఫుడ్ (కూల్ డ్రింక్స్, చిప్స్, ప్యాకేజ్డ్ మాంసం) కేవలం బరువు పెంచడమే కాకుండా మెదడుకు తీవ్ర హాని కలిగిస్తుందని హెల్సింకి యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. జంక్ ఫుడ్ ఎక్కువగా తినే 30 వేల మంది బ్రెయిన్స్ స్కాన్ చేయగా సెల్స్ డ్యామేజ్ & వాపు వంటి మార్పులు కనిపించాయి. ఇవి మెదడును తిరిగి ప్రోగ్రామింగ్ చేసి, అదే చెత్త ఆహారాన్ని పదేపదే కోరుకునేలా చేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.