News December 7, 2025
VKB: నామినేషన్ల ఉపసంహరణ .. బుజ్జగింపుల పర్వం

వికారాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ల నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. తీవ్ర పోటీ ఉన్న స్థానాల్లో, పోలింగ్‌కు ముందే తమ అభ్యర్థులను ఉపసంహరించుకోవాలని ప్రధాన పార్టీల నాయకుల బుజ్జగింపులు మొదలయ్యాయి. మూడో విడత ఉపసంహరణ గడువు ఈ నెల 9న ఉండటంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రత్యర్థులను విత్ డ్రా చేయించేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Similar News
News December 8, 2025
వ్యవసాయ శాఖపై వరంగల్ కలెక్టర్ సమీక్ష

వరంగల్ కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖపై కలెక్టర్ డా.సత్య శారద సమీక్ష నిర్వహించారు. యాసంగి 2025-26కి అవసరమైన విత్తనాలు, ఎరువులు జిల్లాలో సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 12,719 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా కాగా, జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు. ప్రతి మండలంలో యూరియా నిల్వలు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.
News December 8, 2025
ఏలూరు జిల్లాలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్

ఉపాధి కార్యాలయం, నేషనల్ సర్వీస్, స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 12న సత్రంపాడులోని ఐటీఐ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమేష్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. బజాజ్ ఫైనాన్స్, మోహన్ స్పిన్ టెక్స్, ఎస్వీసీ సినిమాస్ వంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారన్నారు. పది-డిగ్రీ ఉత్తీర్ణత పొందిన 18-35 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు అర్హులని ఆయన తెలిపారు.
News December 8, 2025
కడప: ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసిన కలెక్టర్

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించారని ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం మధ్యాహ్నం కడప కలెక్టర్‌లో జరిగిన రివ్యూ సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అందులో భాగంగా కడప కార్పోరేషన్ సరోజినీ నగర్ వార్డు సెక్రటరీ, సింహాద్రిపురం తహశీల్దార్ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్లను సస్పెన్షన్ చేశారు. సింహాద్రిపురం డీటీ, కడప విలేజ్ సర్వేయర్‌కు మెమోలు ఇచ్చారు.


