News November 20, 2025
VKB: నార్మల్ డెలివరీలు అయ్యేలా చర్యలు తీసుకోవాలి: స్వర్ణ కుమారి

సిజరిన్ డెలివరీలు కాకుండా నార్మల్ డెలివరీలు అయ్యేలా వైద్యారోగ్య శాఖ సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ స్వర్ణకుమారి తెలిపారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఆయన వైద్య సిబ్బందితో డాక్టర్లతో సమావేశమై సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా గర్భిణీలకు సరైన విధంగా సేవలందించాలన్నారు.
Similar News
News November 21, 2025
NGKL: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశం కల్పించాలి: ఎంపీ

పార్లమెంటు పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు బ్యాంకు అధికారులు రుణాలు మంజూరు చేసి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎంపీ డాక్టర్ మల్లు రవి సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని గ్రామీణ బ్యాంకు అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. యువత ఆర్థికంగా ఎదగడానికి బ్యాంకు రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. చిన్న, మధ్యతరహా వ్యాపారాలు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని కోరారు.
News November 21, 2025
వీరుల గుడిలో పల్నాడు ఎస్పీ ప్రత్యేక పూజలు

కారంపూడి వీరుల ఉత్సవాల సందర్భంగా పల్నాడు ఎస్పీ రామకృష్ణారావు శుక్రవారం వీరుల గుడిని సందర్శించారు. పల్నాడు యుద్ధంలో వీరులు వాడిన కొణతాల గురించి పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవులును అడిగి తెలుసుకుని ప్రత్యేక పూజలు చేశారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పల్నాటి వీరుల ఉత్సవాల గురించి ఎస్పీకి వివరించారు.
News November 21, 2025
జొమాటో, స్విగ్గీ కస్టమర్లకు షాక్!

తమ కస్టమర్ల డేటాను లక్షలాది రెస్టారెంట్లతో పంచుకోవాలని జొమాటో, స్విగ్గీలు నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే జొమాటో పైలట్ ప్రాజెక్టు కింద ‘పర్మిషన్’ పాప్ అప్ మెసేజ్‌లను పంపుతోంది. దానిపై క్లిక్ చేస్తే మీ డేటా రెస్టారెంట్లకు చేరుతుంది. త్వరలో ఆటోమేటిక్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఇకపై అన్‌వాంటెడ్ మెసేజ్‌లు ఇన్‌బాక్స్‌లను ముంచెత్తనున్నాయి. అలాగే డేటా గోప్యతకు భంగం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు.


